Motivational Speaker: పాక్ జట్టుకు మోటివేషన్
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:49 AM
భారత్‌తో మ్యాచ్ అంటేనే పాకిస్థాన్ జట్టు ఒత్తిడిలో కూరుకుపోతోందట. పైగా ప్రస్తుత జట్టులో యువ క్రికెటర్లు ఎక్కువ మంది....
దుబాయ్: భారత్‌తో మ్యాచ్ అంటేనే పాకిస్థాన్ జట్టు ఒత్తిడిలో కూరుకుపోతోందట. పైగా ప్రస్తుత జట్టులో యువ క్రికెటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వారంతా టీమిండియాతో పోరులో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని, మానసికంగా డీలా పడుతున్నారని భావిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. డా.రహీల్ అహ్మద్ అనే మోటివేషనల్ స్పీకర్ సేవలను తీసుకుంటోంది. ఆసియా కప్‌లో పాక్ గ్రూపు మ్యాచ్‌లు ముగిశాక అతడు జట్టుతో చేరినట్టు సమాచారం. ఇప్పటికే జట్టుకు ఓ దఫా కౌన్సెలింగ్ కూడా ఇచ్చాడట.
ఇవి కూడా చదవండి
పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్
మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి