Share News

UAE Match Delay: దుబాయ్‌లో పాక్‌ ఆటగాళ్ల హైడ్రామా

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:55 AM

యూఏఈతో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడే విషయంలో పాకిస్థాన్‌ హైడ్రామా సృష్టించింది. టోర్నీని బహిష్కరిస్తామన్నట్టుగా హోటల్‌కే పరిమితమైన పాక్‌ జట్టు.. ఆ తర్వాత బెట్టు వీడింది. ‘హ్యాండ్‌ షేక్‌’ వివాదంలో...

UAE Match Delay: దుబాయ్‌లో పాక్‌ ఆటగాళ్ల హైడ్రామా

  • ఆసియా కప్‌లో నేడు

  • శ్రీలంక X అఫ్ఘానిస్థాన్‌

  • రాత్రి 8 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

  • గంట ఆలస్యంగా మొదలైన యూఏఈతో మ్యాచ్‌

దుబాయ్‌: యూఏఈతో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడే విషయంలో పాకిస్థాన్‌ హైడ్రామా సృష్టించింది. టోర్నీని బహిష్కరిస్తామన్నట్టుగా హోటల్‌కే పరిమితమైన పాక్‌ జట్టు.. ఆ తర్వాత బెట్టు వీడింది. ‘హ్యాండ్‌ షేక్‌’ వివాదంలో మ్యాచ్‌ రెఫరీ ఆండీ ప్రైకా్‌ఫ్టను బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్న పాక్‌.. మరోసారి ఐసీసీకి మెయిల్‌ చేసింది. కానీ, పాక్‌ డిమాండ్‌ను ఐసీసీ రెండోసారి తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయంలో హోటల్‌ నుంచి పాక్‌ జట్టు స్టేడియానికి బయలుదేరకుండా బెదిరింపు ధోరణికి దిగడంతో సస్పెన్స్‌ నెలకొంది.

దీంతో యూఏఈతో మ్యాచ్‌ను పాక్‌ బహిష్కరించ నుందన్న వార్తలు వెలువడ్డాయి. అయితే, పాక్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీతో కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాట్లాడిన ఐసీసీ సీఈవో సంజోగ్‌ గుప్తా.. మ్యాచ్‌ రెఫరీగా పైక్రాఫ్ట్‌ కొనసాగుతాడని మరోసారి స్పష్టం చేశాడు. అతడు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని గుర్తు చేశాడు. అంతేకాకుండా పైక్రా్‌ఫ్టను కూడా హెడ్‌ క్వార్టర్స్‌కు పిలిపించిన ఐసీసీ.. అతని విషయంలో పూర్తిగా విచారణ చేసినట్టు రాతపూర్వకంగా పీసీబీకి తెలియజేసింది. ఈ క్రమంలో పలుమార్లు నఖ్వీతో మంతనాలు జరిపిన పాక్‌ జట్టు చివరకు స్టేడియానికి చేరుకొంది. దీంతో మ్యాచ్‌ గంట ఆలస్యంగా మొదలైంది. మరోవైపు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకొన్న పరిణామాలపై పాక్‌ మేనేజర్‌ను పైక్రాఫ్ట్‌ క్షమాపణలు కోరినట్టు పీసీబీ ఎక్స్‌లో పోస్టు చేసింది. కాగా, మ్యాచ్‌ను బహిష్కరిస్తే భారీ జరిమానాలు తప్పవన్న భయంతోనే పాక్‌ దారికొచ్చినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్

పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 18 , 2025 | 10:44 AM