Share News

Pak Cancels Press Meet: భారత్‌తో మ్యాచ్.. పత్రికా సమావేశాన్ని రద్దు చేసుకున్న పాక్

ABN , Publish Date - Sep 20 , 2025 | 06:39 PM

భారత్‌తో హ్యాండ్ షేక్ వివాదం నేపథ్యంలో ఆదివారం సూపర్ 4 మ్యాచ్‌కు ముందు జరగనున్న పత్రికా సమావేశానికి హాజరుకావొద్దని పాక్ నిర్ణయించింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ విషయంలో ప్రశ్నల ఎదుర్కోవడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Pak Cancels Press Meet: భారత్‌తో మ్యాచ్.. పత్రికా సమావేశాన్ని రద్దు చేసుకున్న పాక్
Asia Cup Pak Cancels Press Meet

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ టోర్నీలో సూపర్-4 దశలో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్లు మరోసారి తలపడనున్నాయి. అయితే, ఈసారి మ్యాచు ముందు జరిగే పత్రికా సమావేశంలో పాక్ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పైక్రాఫ్ట్ విషయంలో ప్రశ్నలు ఎదుర్కోవడం ఇష్టం లేకే పత్రికా సమావేశంలో పాల్గొనకూడదని పాక్ నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి (Pak press conference cancelled).

గత మ్యాచ్‌లో పాక్ జట్టు సభ్యులతో భారత క్రీడాకారులు కరచాలనం చేయకపోవడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ కూడా బాధ్యత వహించాలని పాక్ తేల్చి చెప్పింది. ఆయనను రిఫరీగా తొలగించాలని కూడా పట్టుబట్టింది. అయితే, ఐసీసీ మాత్రం పాక్ వాదనలను తోసి పుచ్చడమే కాకుండా రేపటి మ్యాచ్‌కు కూడా ఆండీని రిఫరీగా కొనసాగించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భాగమయ్యే అధికారుల జాబితా ఇంకా విడుదల కాలేదు (Pakistan vs India controversy).

గత మ్యాచ్‌లో టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌తో తాము కరచాలనం చేయబోమన్న విషయాన్ని టీమిండియా ఆండీ ద్వారా చేరవేసింది. ఈ విషయంపై పాక్ క్రికెట్ బోర్డు అగ్గిమీద గుగ్గిలమైంది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఆండీ వ్యవహరించారని మండిపడింది. తదుపరి మ్యాచ్‌లో ఆయన రిఫరీగా ఉండొద్దని కోరింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ అభ్యర్థనను తోసి పుచ్చింది. మ్యాచ్ కొన్ని నిమిషాల ముందు ఆండీ.. టీమిండియా సందేహాన్ని చేరవేయడం మినహా చేయగలిగింది ఏమీ లేదని స్పష్టం చేసింది (handshake row).


ఆ తరువాత ఐసీసీ చొరవతో ఆండీ పైక్రాఫ్ట్, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, హెడ్ కోచ్ మైక్ హెసెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆండీ తమకు క్షమాపణ చెప్పారంటూ పాక్ చేసుకున్న ప్రచారం కూడా బెడిసికొట్టింది. ఈ ఉదంతంపై ఐసీసీ సీరియస్ అయింది. ఆండీ క్షమాపణలు చెప్పలేదని మరోసారి స్పష్టం చేస్తూ పీసీబీకి ఈమెయిల్ చేసింది. వీడియో లీక్‌తో మరోసారి నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. అంతేకాకుండా, రేపటి మ్యాచ్‌కు ఆండీనే రిఫరీగా కొనసాగించింది. ఈ నేపథ్యంలో రేపటి పత్రికా సమావేశానికి పాక్ దూరంగా ఉండేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

Asia Cup Super 4 Kicks Off: ఇక సూపర్‌ సమరం

అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 20 , 2025 | 08:02 PM