Share News

Asia Cup Super 4 Kicks Off: ఇక సూపర్‌ సమరం

ABN , Publish Date - Sep 20 , 2025 | 05:57 AM

ఆసియాకప్‌ టీ20 టోర్నీలో శనివారం సూపర్‌-4 పోరుకు తెర లేవనుంది. గ్రూప్‌ ‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్థాన్‌.. గ్రూప్‌ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు ఇందుకు అర్హత సాధించిన విషయం...

Asia Cup Super 4 Kicks Off: ఇక సూపర్‌ సమరం

నేడు లంక-బంగ్లా తొలి పోరు

సోనీ నెట్‌వర్క్‌లో..

ఆసియాకప్‌

దుబాయ్‌: ఆసియాకప్‌ టీ20 టోర్నీలో శనివారం సూపర్‌-4 పోరుకు తెర లేవనుంది. గ్రూప్‌ ‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్థాన్‌.. గ్రూప్‌ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు ఇందుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. సూపర్‌-4లో ప్రతీ జట్టు ఇతర మూడు జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఈనెల 26 వరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు జరుగనుండగా, టాప్‌-2లో నిలిచిన జట్లు 28న దుబాయ్‌లో జరిగే ఫైనల్లో తలపడతాయి. ముందుగా శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి లంక ఊపు మీదుంది. ఓపెనర్లు నిస్సాంక, మెండిస్‌ ఫామ్‌లో ఉన్నారు. అయితే మిడిలార్డర్‌ పుంజుకోవాల్సి ఉంది. అటు బంగ్లాదేశ్‌ జట్టు లంకపై గ్రూప్‌ దశలో ఎదురైన ఓటమికి ఈసారి బదులు తీర్చుకోవాలనుకుంటోంది. లిట్టన్‌ దాస్‌, హ్రిదయ్‌ బ్యాటింగ్‌లో కీలకం కానుండగా.. స్పిన్నర్లు తన్‌జీమ్‌, రిషాద్‌ రాణిస్తుండడం సానుకూలాంశం.

సూపర్‌-4 మ్యాచ్‌ల షెడ్యూల్‌

సెప్టెంబరు 20 శ్రీలంకగీబంగ్లాదేశ్‌

సెప్టెంబరు 21 భారత్‌గీపాకిస్థాన్‌

సెప్టెంబరు 23 శ్రీలంక గీపాకిస్థాన్‌

సెప్టెంబరు 24 భారత్‌ గీబంగ్లాదేశ్‌

సెప్టెంబరు 25 బంగ్లాదేశ్‌ గీపాకిస్థాన్‌

సెప్టెంబరు 26 భారత్‌ గీశ్రీలంక

సెప్టెంబరు 28 ఫైనల్‌

(మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటల నుంచి)

ఇవి కూడా చదవండి

పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్

మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 20 , 2025 | 06:02 AM