SA VS PAK: దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన పాకిస్తాన్
ABN , Publish Date - Nov 08 , 2025 | 09:57 PM
ఫైసలాబాద్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ కైవం చేసుకోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రోటీస్ జట్టుతో ఐదు వన్డే సిరీస్‌లు జరగ్గా.. పాక్‌కు ఇది నాలుగో విజయం.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్(Pakistan vs South Africa ODI) ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రోటీస్ జట్టుతో ఐదు వన్డే సిరీస్‌లు జరగ్గా.. పాక్‌కు ఇది నాలుగో విజయం. ఫైసలాబాద్( Faisalabad ODI) వేదికగా జరిగిన ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 37.5 ఓవర్లలో కేవలం 143 పరుగులకే ఆలౌటైంది. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు విలవిల్లాడారు.
అబ్రార్ అహ్మద్(Abrar Ahmed) తన పది ఓవర్ల కోటాలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అతడితో పాటు కెప్టెన్ షాహీన్ అఫ్రిది(Shaheen Afridi), సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (72), ప్రిటోరియస్ (57) మినహా మిగితా ప్లేయర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. అనంతరం 144 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన పాక్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 25.1 ఓవర్లలో చేధించింది. పాక్ ఓపెనర్ సైమ్ అయూబ్(77) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా అంతకుముందు టీ20 సిరీస్‌ను కూడా 2-1 తేడాతో పాకిస్థాన్ కైవసం చేసుకుంది.
ఇవి కూడా చదవండి
2028 Olympics: భారత్, పాక్ పోరు లేనట్లేనా..?
ND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి