2028 Olympics: భారత్, పాక్ పోరు లేనట్లేనా..?
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:32 PM
2028లో లాస్ ఏంజెలెస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపై ఐసీసీ కొన్ని రూల్స్ ను రూపొందించింది. తాజాగా దుబాయ్‌లో జరిగిన సమావేశంలో వీటిని ఖరారు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఆరు జట్లు చొప్పున పురుషులు, మహిళల జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయని ఆ కథనంలో పేర్కొన్నాయి.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఒక రకమైన హైటెన్షన్ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ రెండు దేశాల మ్యాచ్ అంటే పండుగే. అందుకే ఈ దాయాది దేశాల మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంటాయి. ఇటీవల జరిగిన ఆసియా కప్ లో భారత, పాక్ మూడు సార్లు తలపడ్డాయి. ఆ మూడు మ్యాచుల్లోనూ ఇండియానే విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్(Olympic cricket 2028) ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ పోరు జరిగే అవకాశాలు కన్పించట్లేదు. ఐసీసీ రూపొందించిన కొత్త నిబంధనలతో భారత్-పాక్ మ్యాచ్ (India vs Pakistan) జరగడం అసాధ్యమే అనే టాక్ వినిపిస్తోంది.
లాస్ ఏంజెలెస్ (Olympic Games 2028) వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపై ఐసీసీ కొన్ని రూల్స్ ను రూపొందించింది. తాజాగా దుబాయ్‌లో జరిగిన సమావేశంలో వీటిని ఖరారు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఆరు జట్లు చొప్పున పురుషులు, మహిళల జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయని ఆ కథనంలో పేర్కొన్నాయి. ఖండాల ప్రాతిపాదికన ఈ జట్లను ఎంపిక చేయాలని ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లో టాప్‌లో ఉన్న జట్లకు ఒలింపిక్స్‌లో నేరుగా ప్రవేశం లభిస్తుంది. అలానే ఆతిథ్య దేశంకు చోటు దక్కనుంది. ఆరో జట్టును క్వాలిఫయర్ రౌండ్ ఏర్పాటుచేసి నిర్ణయిస్తారు. ఐసీసీ ర్యాంకుల ప్రకారం ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి సౌతాఫ్రికా(South Africa), యూరప్ నుంచి ఇంగ్లాండ్(England) జట్లు అర్హత సాధించే అవకాశం ఉందని సమాచారం.
2028లో జరిగే ఈ ఒలింపిక్స్( Los Angeles Games)కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం కల్పిస్తున్నాయి. ఈ రెండింటిలో ఒక జట్టును ఆతిథ్య జట్టు కింద ఎంపిక చేయనున్నారు. ఇక, ఆరో స్థానం కోసం క్వాలిఫయర్ పోటీలపై త్వరలోనే ఐసీసీ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఒలింపిక్స్ అనేది గ్లోబల్ ఈవెంట్ కనుక అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేందుకు ఒక్కో రీజియన్ నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసి క్వాలిఫయర్ రౌండ్ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఆ విధంగా చూస్తే ఆసియాలో ర్యాంకింగ్స్ ప్రకారం పాక్‌కు ప్రాతినిధ్యం దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ (IND vs PAK) ఉండకపోవచ్చు. ఆసియా కప్ లో భారత్, పాక్ మధ్య కరచాలన వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ విన్నర్ గా నిలిచిన ఇండియాకు ఇప్పటి వరకు ట్రోఫీని ఏసీసీ ఛైర్మన్, పాక్ మంత్రి నఖ్వీ అందజేయలేదు.
ఇవి కూడా చదవండి
పెళ్లి తర్వాత కోహ్లీ పూర్తిగా మారిపోయాడు: కైఫ్
భారీ రికార్డుకు చేరువలో బుమ్రా
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి