Share News

ICC Pak Disciplinary Action: వీడియో లీక్‌పై ఐసీసీ సీరియస్.. పాక్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ఛాన్స్

ABN , Publish Date - Sep 19 , 2025 | 09:36 AM

మ్యాచ్ రెఫరీ పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పినట్టు వీడియో లీక్ చేసినందుకు పీసీబీపై ఐసీసీ సీరియస్ అయ్యింది. ఈ విషయమై పీసీబీకి లేఖ రాసిన ఐసీసీ.. క్రమశిక్షణ చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ICC Pak Disciplinary Action: వీడియో లీక్‌పై ఐసీసీ సీరియస్.. పాక్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ఛాన్స్
Pakistan Asia Cup ICC notice

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ ఈమెయిల్ చేసింది. ఈ ఉల్లంఘనలపై అధికారిక పరిశీలన ప్రారంభమైందని తెలిపింది. అయితే, పాక్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అంశాన్ని కూడా ఐసీసీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది (Pakistan Asia Cup ICC notice).

ఇటీవలి మ్యాచ్‌లో పాక్‌తో భారత క్రీడాకారులు కరచాలనం చేయకపోవడం కాంట్రవర్సీకి దారి తీసిన విషయం తెలిసిందే. ఇందులో రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తప్పు కూడా ఉందని పాక్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో యూఏఈపై విజయం తరువాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా, టీమ్ మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా, మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి వీడియోను పీసీబీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. నో హ్యాండ్ షేక్ వివాదంలో రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తమకు క్షమాపణలు చెప్పినట్టు కూడా వెల్లడించింది. ఇదే ప్రస్తుతం వివాదానికి దారి తీసినట్టు తెలుస్తోంది (PCB disciplinary action).


వీడియో వైరల్ కావడంతో ఐసీసీ స్పందించింది. పైక్రాఫ్ట్ తాను తప్పు చేసినందుకు క్షమాపణలు చెప్పలేదని వివరణ ఇచ్చింది. సమాచార మార్పిడిలో లోపంపై మాత్రమే ఆయన స్పందించినట్టు పేర్కొంది. తమ అంతర్గత విచారణలో పైక్రాఫ్ట్ తప్పేమీ లేదన్న విషయం తేలిందని చెప్పింది. అయితే, పైక్రాఫ్ట్ సమావేశం తాలూకు వీడియోను రిలీజ్ చేయడం మాత్రం నిబంధనలను ఉల్లంఘించడమేనని ఐసీసీ భావిస్తోంది. ఈ అంశంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పాక్ బోర్డుకు లేఖ రాసింది (Handshake Row).

పాక్‌తో మ్యాచ్ సందర్భంగా భారత క్రీడాకారులు ప్రత్యర్థి టీమ్ జట్టు సభ్యులతో కరచాలనం చేయని విషయం తెలిసిందే. మ్యాచ్ మొదలు చివరి వరకూ అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. టాస్ సమయంలో కూడా పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయొద్దన్న భారత క్రీడాకారుల నిర్ణయాన్ని మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పాక్ జట్టుకు చేరవేశారు. దీంతో, పాక్ కెప్టెన్ మ్యాచ్ సమయంలో భారత జట్టు కెప్టెన్‌కు దూరంగా ఉన్నాడు. ఈ ఉదంతంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పీసీబీ.. మ్యాచ్ రెఫరీని తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే, ఐసీసీ మాత్రం ఈ డిమాండ్స్‌ను తొసిపుచ్చింది. ఇక పైక్రాఫ్ట్ వీడియోను అనుమతి లేకుండా విడుదల చేయడంపై ఐసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.


ఇవి కూడా చదవండి

పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్

మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 09:47 AM