West Indies Series 2025: పడిక్కళ్‌కు చోటు
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:59 AM
వెస్టిండీ్‌సతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టును గురువారం ప్రకటించారు. 15 మందితో కూడిన బృందానికి శుభ్‌మన్ గిల్ నేతృత్వం వహిస్తుండగా, వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను...
వైస్ కెప్టెన్‌గా జడేజా
నితీశ్ కుమార్ ఫిట్
కరుణ్‌పై వేటు
వెస్టిండీ్‌సతో సిరీ్‌సకు భారత జట్టు
న్యూఢిల్లీ: వెస్టిండీ్‌సతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టును గురువారం ప్రకటించారు. 15 మందితో కూడిన బృందానికి శుభ్‌మన్ గిల్ నేతృత్వం వహిస్తుండగా, వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను నియమించారు. ఇంగ్లండ్ పర్యటనలో డిప్యూటీగా వ్యవహరించిన రిషభ్ పంత్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం ఆసియాకప్ కోసం దుబాయ్‌లో ఉన్న కెప్టెన్ గిల్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గంభీర్ సమావేశమై జట్టును ప్రకటించారు. అక్టోబరు 2 నుంచి అహ్మదాబాద్‌లో తొలి టెస్టు జరుగనుంది. మరోవైపు దులీప్ ట్రోఫీ, భారత్ ‘ఎ’ జట్ల తరఫున విశేషంగా రాణించిన దేవ్‌దత్ పడిక్కళ్‌కు మరోసారి పిలుపందింది. గతేడాది అతను రెండు టెస్టులాడాడు. అలాగే గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. పంత్ గాయంతో దూరం కావడంతో ధ్రువ్ జురెల్ ప్రధాన కీపర్‌గా ఉండనుండగా, అతడికి బ్యాక్‌పగా ఎన్.జగదీశన్‌ను తీసుకున్నారు. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడిన కరుణ్ నాయర్, పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు మాత్రం జట్టులో చోటు దక్కలేదు. కరుణ్ నుంచి తాము ఎక్కువగా ఆశించినప్పటికీ అతను నిరాశపర్చినట్టు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. అటు తనపై వేటుకు కారణమేంటో సెలెక్టర్లనే అడగాలని కరుణ్ తేల్చాడు. రిజర్వ్ ఓపెనర్‌గా ఉన్న అభిమన్యు ఈశ్వరన్, పేసర్ ఆకాశ్ దీప్‌లను ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియాకు ఎంపిక చేశారు. మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. పని ఒత్తిడి కారణంగా స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిస్తారనే కామెంట్స్ వినిపించినా అతడిని కూడా ఆడించబోతున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్, జడేజా, కుల్దీప్, సుందర్ ఉన్నారు.
భారత టెస్టు జట్టు: గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, పడిక్కళ్, జురెల్, జగదీశన్, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్, అక్షర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి