Duleep Trophy: సెమీస్‌లో నార్త్ సెంట్రల్ జోన్లు
ABN , Publish Date - Sep 01 , 2025 | 02:27 AM
దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు తమ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా సెమీ్‌సలో ప్రవేశించాయి. ఆదివారం ఈస్ట్ జోన్‌తో ముగిసిన క్వార్టర్స్‌ను నార్త్ జోన్ డ్రాగా ముగించింది. మూడో రోజే 563 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్నప్పటికీ...
బెంగళూరు: దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు తమ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా సెమీ్‌సలో ప్రవేశించాయి. ఆదివారం ఈస్ట్ జోన్‌తో ముగిసిన క్వార్టర్స్‌ను నార్త్ జోన్ డ్రాగా ముగించింది. మూడో రోజే 563 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్నప్పటికీ నార్త్ తమ ఆటను కొనసాగించింది. ఈక్రమంలో ఆయుష్ బదోని (204) డబుల్ సెంచరీ సాధించగా, కెప్టెన్ అంకిత్ (198) తృటిలో ఈ ఫీట్ మిస్సయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 658/4 స్కోరు వద్ద నార్త్ జోన్‌డిక్లేర్ చేయడంతో ఇరుజట్లు డ్రాకు అంగీకరించాయి. దీంతో తొలి ఇన్నింగ్స్ 833 పరుగుల ఆధిక్యంతో నార్త్ సెమీ్‌స చేరింది. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 రన్స్ చేసింది. సెంట్రల్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్ మధ్య క్వార్ట ర్స్ కూడా డ్రాగా ముగిసింది. అయితే 478 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెంట్రల్ జోన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం ఆఖరి రోజు నార్త్ ఈస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 200/6 స్కోరు చేసింది.
రషీద్‌కు చోటు: స్పిన్నర్ సాయి కిశోర్ గాయంతో దూరమవడంతో అతని స్థానంలో ఆంధ్ర యువ బౌలర్ షేక్ రషీద్‌ను సౌత్ జోన్ జట్టులోకి తీసుకున్నారు. ఇక, తిలక్ వర్మ ఆసియా కప్‌లో ఆడనుండ డంతో.. అతని స్థానంలో సెమీస్‌కు సౌత్ జోన్ కెప్టెన్‌గా అజారుద్దీన్‌ను నియమించారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి