Share News

No Branco Test: రోహిత్‌ గిల్‌ అండ్‌ కోకు బ్రాంకో టెస్ట్‌ లేనట్టే

ABN , Publish Date - Sep 04 , 2025 | 05:59 AM

భారత జట్టు ఆటగాళ్లకు బీసీసీఐ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సీ (సీవోఈ)లో ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు నిర్వహిస్తూంటుంది.. ఇది రొటీన్‌గానే జరిగేదే అయినా.. సరికొత్తగా ‘బ్రాంకో టెస్ట్‌ను ప్రవేశపెడుతున్నారని కొద్ది రోజుల క్రితం...

No Branco Test: రోహిత్‌ గిల్‌ అండ్‌ కోకు బ్రాంకో టెస్ట్‌ లేనట్టే

న్యూఢిల్లీ: భారత జట్టు ఆటగాళ్లకు బీసీసీఐ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సీ (సీవోఈ)లో ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు నిర్వహిస్తూంటుంది.. ఇది రొటీన్‌గానే జరిగేదే అయినా.. సరికొత్తగా ‘బ్రాంకో టెస్ట్‌ను ప్రవేశపెడుతున్నారని కొద్ది రోజుల క్రితం వచ్చిన వార్త కారణంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. రగ్బీ ఆటగాళ్లకు నిర్వహించే ఈ కఠిన పరీక్షను రోహిత్‌ శర్మను బయటకు పంపేందుకే ప్రవేశపెడుతున్నారంటూ విమర్శలు కూడా వినవచ్చాయి. తాజా సీజన్‌ నేపథ్యంలో రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌, బుమ్రా సహా మరికొందరు కాంట్రాక్ట్‌ ప్లేయర్లు సీవోఈలో ఫిట్‌నెస్‌ పరీక్షకు హాజరయ్యారు. అయితే, వీరెవరికీ బ్రాంకో టెస్ట్‌ నిర్వహించలేదని తెలుస్తోంది. ఈ నూతన టెస్ట్‌ను ఇంకా ఫిట్‌నెస్‌ పరీక్షల్లో భాగం చేయలేదట. అందుకే పాతపద్ధతిలో యో-యో టెస్ట్‌ ద్వారానే ఫిట్‌నె్‌సను పరీక్షించిందట. పైగా బోర్డు కూడా బ్రాంకో టెస్ట్‌ను ప్రవేశపెడుతున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించలేదు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2025 | 05:59 AM