Share News

World Boxing Championships: నిఖత్‌పై అందరి దృష్టి

ABN , Publish Date - Sep 04 , 2025 | 06:04 AM

ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప్స గురువారం ఇక్కడ ఆరంభం కానున్నాయి. ప్రపంచ బాక్సింగ్‌ కొత్త పాలక మండలి..‘వరల్డ్‌ బాక్సింగ్‌’ ఆధ్వర్యంలో తొలిసారి ఈ పోటీలు జరగనున్నాయి. ఈ చాంపియన్‌షి్‌ప్సను...

World Boxing Championships: నిఖత్‌పై అందరి దృష్టి

నేటినుంచి ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప్స

లివర్‌పూల్‌ (ఇంగ్లండ్‌): ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప్స గురువారం ఇక్కడ ఆరంభం కానున్నాయి. ప్రపంచ బాక్సింగ్‌ కొత్త పాలక మండలి..‘వరల్డ్‌ బాక్సింగ్‌’ ఆధ్వర్యంలో తొలిసారి ఈ పోటీలు జరగనున్నాయి. ఈ చాంపియన్‌షి్‌ప్సను పురుషులు, మహిళల విభాగాలలో కలిపి ఒకేసారి నిర్వహిస్తుండడం విశేషం. ఇక..భారత్‌కు సంబంధించిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌పై అందరి దృష్టి నిలిచింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ వరుసగా మూడో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో మూడు వేర్వేరు బరువు విభాగాలలో తలపడుతుండడం గమనార్హం. 2022లో 52కి. విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన నిఖత్‌.. 2023లో 50కి. కేటగిరీలో టైటిల్‌ దక్కించుకుంది. ఇక ఈసారి 51 కి. విభాగంలో తలపడుతోంది. మారిన బరువు విభాగంలో నిఖత్‌ ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరం. పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండో రౌండ్‌లోనే ఓటమి చవిచూసిన జరీన్‌.. ఏడాది తర్వాత అంతర్జాతీయ పోటీల బరిలో దిగుతోంది. పారిస్‌ క్రీడల తర్వాత నిఖత్‌తోపాటు లవ్లీనా ఒక దేశవాళీ ఈవెంట్‌లో మాత్రమే పాల్గొన్నారు. ఇద్దరికీ తొలి రౌండ్లలో కఠిన ప్రత్యర్థులు ఎదురు కానున్నారు. 65 దేశాల నుంచి 550మంది బాక్సర్లు ఈ ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సలో తలపడుతున్నారు. భారత్‌ నుంచి పురుషుల, మహిళల విభాగాల్లో చెరి పదేసి మంది బాక్సర్లు పోటీపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2025 | 06:04 AM