Share News

Nikhat Zareen World Boxing Cup: బరిలో నిఖత్‌ ప్రపంచ బాక్సింగ్‌ కప్‌

ABN , Publish Date - Oct 29 , 2025 | 06:22 AM

ప్రపంచ బాక్సింగ్‌ కప్‌లో పాల్గొనే భారత బృందాన్ని జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య వెల్లడించింది. మహిళల 51 కిలోల విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ బరిలోకి దిగుతోంది. ఈ పోటీల గురించి నిఖత్‌ మాట్లాడుతూ...

Nikhat Zareen World Boxing Cup: బరిలో నిఖత్‌ ప్రపంచ బాక్సింగ్‌ కప్‌

న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్‌ కప్‌లో పాల్గొనే భారత బృందాన్ని జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య వెల్లడించింది. మహిళల 51 కిలోల విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ బరిలోకి దిగుతోంది. ఈ పోటీల గురించి నిఖత్‌ మాట్లాడుతూ వచ్చే ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల్లో బరిలోకి దిగడానికి కావాల్సిన ర్యాంకింగ్‌ పాయింట్లకు ఈ ప్రపంచ బాక్సింగ్‌ కప్‌ ఫైనల్స్‌ పోటీలు ముఖ్యమైనవని, ఇందులో ఎక్కువ పాయింట్లు సాధించి సీడింగ్‌ను మెరుగు పర్చుకోవాల్సి ఉందని తెలిపింది. నిఖత్‌తో పాటు మొత్తం ఇరవై మంది భారత బాక్సర్లు వివిధ విభాగాల్లో తలపడనున్నారు. ఈ పోటీలు వచ్చే నెల 14 నుంచి 21 వరకు గ్రేటర్‌ నోయిడాలో జరగనున్నాయి. మొత్తం 18 దేశాల నుంచి 140 మందికి పైగా బాక్సర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 06:22 AM