Share News

Nikhat Zareen: పతకానికి బౌట్‌ దూరంలో

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:32 AM

ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌.. ముచ్చటగా మూడోసారి మెగా టోర్నీలో పతకం సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ తెలుగమ్మాయి...

Nikhat Zareen: పతకానికి బౌట్‌ దూరంలో

  • క్వార్టర్స్‌కు నిఖత్‌

  • వరల్డ్‌ బాక్సింగ్‌

లివర్‌పూల్‌: ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌.. ముచ్చటగా మూడోసారి మెగా టోర్నీలో పతకం సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ తెలుగమ్మాయి ప్రపంచ చాంపియన్‌షిప్‌ 51 కిలోల విభాగంలో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా పతకానికి కేవలం ఒక్క బౌట్‌ దూరంలో నిలిచింది. సెమీస్‌ చేరితే, కనీసం కాంస్య పతకం ఖాయం అవుతుంది. అయితే, ప్రత్యర్థి నుంచి కఠిన సవాల్‌ను ఎదుర్కొని ప్రీక్వార్టర్స్‌ను అధిగమించింది. మంగళవారం పోరులో అంతగా అనుభవం లేని జపాన్‌ బాక్సర్‌, 21 ఏళ్ల యున నిషినకపై నిఖత్‌ 5-0తో పోరాడి గెలిచింది. ఇక, రెండుసార్లు ఒలింపిక్‌ రజత పతక విజేత బ్యూస్‌ నాజ్‌ కకిరోగ్లు (టర్కీ) రూపంలో నిఖత్‌కు క్వార్టర్స్‌లో ముప్పు పొంచి ఉంది. పురుషుల విభాగంలో సుమీత్‌ (75 కిలోలు), సచిన్‌ సివాచ్‌ (60 కి), నరేందర్‌ బ్రేవాల్‌ (90+ కి) ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. సుమీత్‌ 0-5తో కివాన్‌ (బల్గేరియా) చేతిలో, సచిన్‌ 1-4తో బిబార్స్‌ (కజకిస్థాన్‌) చేతిలో, నరేందర్‌ 1-4తో డిగో లెంజీ (ఇటలీ) చేతిలో ఓడారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 05:32 AM