Womens World Cup: ఓటమితో ముగించిన కివీస్
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:30 AM
మహిళల వరల్డ్‌క్‌పను న్యూజిలాండ్ ఓటమితో ముగించింది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఈ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. కివీస్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం...
రెండో స్థానానికి ఇంగ్లండ్
విశాఖపట్నం: మహిళల వరల్డ్‌క్‌పను న్యూజిలాండ్ ఓటమితో ముగించింది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఈ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. కివీస్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే దక్కగా. రెండు వర్షార్పణమయ్యాయి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 38.2 ఓవర్లలో 168 పరుగులకు కుప్పకూలింది. ప్లిమ్మర్ (43), అమేలియా కెర్ (35) రాణించారు. లిన్సేకు మూడు, బ్రంట్.. కాప్సీలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్ 29.2 ఓవర్లలో 172/2 స్కోరుతో నెగ్గింది. ఎమీ జోన్స్ (86 నాటౌట్), బ్యూమాంట్ (40), హీథర్ (33) ఆకట్టుకున్నారు.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా ర.రే
ఆస్ట్రేలియా 7 6 0 1 13 2.102
ఇంగ్లండ్ 7 5 1 1 11 1.233
దక్షిణాఫ్రికా 7 5 2 0 10 -0.379
భారత్ 7 3 3 1 7 0.628
శ్రీలంక 7 1 3 3 5 -1.035
న్యూజిలాండ్ 7 1 4 2 4 -0.876
బంగ్లాదేశ్ 7 1 5 1 3 -0.578
పాకిస్థాన్ 7 0 4 3 3 -2.651
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
పా: పాయింట్లు; ఫ.తే: ఫలితం తేలనవి; ర.రే: రన్‌రేట్
సోఫీ డివైన్ వీడ్కోలు
కివీస్ మహిళల క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన కెప్టెన్ సోఫీ డివైన్ తన 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌తో కెరీర్‌ను ముగిస్తానని 36 ఏళ్ల సోఫీ ఇదివరకే ప్రకటించింది. 2006లో అరంగేట్రం చేసిన తను 159 వన్డేల్లో తొమ్మిది సెంచరీలతో 4,279 రన్స్, 111 వికెట్లు.. అలాగే 146 టీ20ల్లో ఓ సెంచరీతో 3,431 పరుగులు, 119 వికెట్లు తీసి అద్భుత ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుంది. 2011-12లో క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చి కివీస్ హాకీ జట్టుకు ఆడడం విశేషం. మ్యాచ్ ముగిశాక ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ సంతకాలతో కూడిన జెర్సీని డివైన్‌కు బహుమతిగా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News