Share News

New Zealands Solid Start: న్యూజిలాండ్‌ బోణీ

ABN , Publish Date - Oct 27 , 2025 | 06:16 AM

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సలో న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో పేసర్లు రాణించడంతో కివీస్‌..

New Zealands Solid Start: న్యూజిలాండ్‌ బోణీ

  • బ్రూక్‌ శతకం వృధా

  • తొలి వన్డేలో ఇంగ్లండ్‌ ఓటమి

మౌంట్‌ మాంగనూ: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సలో న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో పేసర్లు రాణించడంతో కివీస్‌ నాలుగు వికెట్లతో నెగ్గింది. ముందుగా ఇంగ్లండ్‌ 35.2 ఓవర్లలో 223 పరుగులకు కుప్పకూలింది. 56/6 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (135) శతకంతో ఆదుకోగా ఒవర్టన్‌ (46) సహకరించాడు. మిగతా తొమ్మిది మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. పేసర్లు జకారీ ఫోక్స్‌కు 4, డఫీకి 3, హెన్రీకి 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో కివీస్‌ 36.4 ఓవర్లలో 224/6 స్కోరుతో నెగ్గింది. మిచెల్‌ (78 నాటౌట్‌), బ్రేస్‌వెల్‌ (51) అర్ధసెంచరీలు సాధించారు. కార్స్‌కు 3 వికెట్లు తీశాడు. తమ జట్టు ఓటమిపాలైనా ఒంటరి పోరాటం చేసిన బ్రూక్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ లభించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 06:16 AM