Share News

Nepal Cricket Historic Win: వెస్టిండీస్‌కు నేపాల్‌ షాక్‌

ABN , Publish Date - Sep 28 , 2025 | 05:14 AM

పసికూన నేపాల్‌ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో పెను సంచలనం సృష్టించింది. బలమైన వెస్టిండీస్‌కు షాకిచ్చింది. మూడు టీ20ల సిరీ్‌సలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌...

Nepal Cricket Historic Win: వెస్టిండీస్‌కు నేపాల్‌ షాక్‌

తొలి టీ20లో 19 పరుగులతో గెలుపు

షార్జా: పసికూన నేపాల్‌ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో పెను సంచలనం సృష్టించింది. బలమైన వెస్టిండీస్‌కు షాకిచ్చింది. మూడు టీ20ల సిరీ్‌సలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌ 19 పరుగులతో విండీస్‌ను చిత్తుచేసింది. దీంతో ఐసీసీ సభ్య దేశంపై తొలి గెలుపును అందుకుంది. శని వారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట నేపాల్‌ 20 ఓవర్లలో 148/8 స్కోరు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (38), కుశాల్‌ మల్లా (30), గుల్షన్‌ ఝా (22) సత్తా చాటారు. హోల్డర్‌ 4, నవీన్‌ బిదిశీ 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 129/9 స్కోరుకే పరిమితమైంది. నవీన్‌ బిదిశీ (22) టాప్‌ స్కోరర్‌. అమీర్‌ (19), ఫాబియన్‌ (19), కెప్టెన్‌ అకీల్‌ హొసేన్‌ (18), కార్టీ (16), అకీమ్‌ (15) రాణించినా.. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకోవడంతో విండీ్‌సకు పరాభవం తప్పలేదు. కుశాల్‌ 2 వికెట్లు తీశాడు. రోహిత్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్

విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 05:14 AM