Share News

World Athletics Championships: విఫలమైన నీరజ్‌ మెరిసిన సచిన్‌

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:15 AM

జావెలిన్‌ వీరుడు నీరజ్‌ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో నిరాశపరిచాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన నీరజ్‌.. టైటిల్‌ నిలబెట్టుకోవడంలో విఫలమవడమే...

World Athletics Championships: విఫలమైన నీరజ్‌ మెరిసిన సచిన్‌

  • యాదవ్‌కు నాలుగో స్థానం.. త్రుటిలో చేజారిన పతకం

  • వాల్కాట్‌కు జావెలిన్‌ టైటిల్‌

టోక్యో: జావెలిన్‌ వీరుడు నీరజ్‌ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో నిరాశపరిచాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన నీరజ్‌.. టైటిల్‌ నిలబెట్టుకోవడంలో విఫలమవడమే గాకుండా కనీసం పోడియం ఫినిష్‌ కూడా చేయలేకపోయాడు. గురువారం జరిగిన పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్‌ ఒక్కసారి కూడా 85 మీటర్ల మార్క్‌ను అందుకోలేకపోయాడు. మొత్తం 12 మంది పోటీపడ్డ ఫైనల్స్‌లో నీరజ్‌.. జావెలిన్‌ను 84.03 మీటర్లు మాత్రమే విసిరి ఏకంగా ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యాడు. హాట్‌ ఫేవరెట్‌గా పోటీపడ్డ నీరజ్‌ మొదటి ప్రయత్నంలో జావెలిన్‌ను 83.65 మీటర్ల దూరం విసిరాడు. రెండో రౌండ్‌లో 84.03 మీటర్లు విసిరిన చోప్రా.. మూడో ప్రయత్నంలో ఫౌల్‌ చేశాడు. నాలుగో రౌండ్‌లో 82.86 మీటర్లతో సరిపెట్టుకున్న నీరజ్‌.. ఐదో ప్రయత్నంలో ఫౌల్‌ చేసి పతక రేసు నుంచి నిష్క్రమించాడు. అయితే నీరజ్‌ నిరాశపరిచిన చోట.. మరో భారత త్రోయర్‌ సచిన్‌ యాదవ్‌ తన అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంచనాలకు మించి రాణించిన సచిన్‌.. అత్యుత్తమంగా 86.27 మీటర్లు విసిరి నాలుగో స్థానంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. నీరజ్‌ కంటే ఎన్నోరెట్లు అద్భుతంగా రాణించిన సచిన్‌.. కేవలం 40 సెంటీ మీటర్ల తేడాతో కాంస్య పతకం చేజార్చుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసి పతకంపై ఆశలు రేపిన సచిన్‌.. ఆఖరి ప్రయత్నంలో 80.95 మీటర్లే త్రో చేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. మూడో స్థానంలో నిలిచిన అమెరికా త్రోయర్‌ కుర్టిస్‌ థాంప్సన్‌ 86.67 మీటర్లతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఇక, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు చెందిన కిషోర్న్‌ వాల్కాట్‌ అందరి కంటే అత్యుత్తమంగా 88.16 మీటర్లు త్రో చేసి స్వర్ణం ఎగరేసుకుపోయాడు. గ్రెనెడా అథ్లెట్‌ అండర్సన్‌ పీటర్స్‌ 87.38 మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం అందుకున్నాడు. ఇటీవల డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన జర్మన్‌ స్టార్‌ జులియన్‌ వెబర్‌ (86.11 మీ.) ఇక్కడ ఐదో స్థానానికి పడిపోయాడు. ఇక, నీరజ్‌కు పోటీగా భావించిన పాకిస్థాన్‌ స్టార్‌, పారిస్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అర్షద్‌ నదీమ్‌ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఫైనల్లో పూర్తిగా తేలిపోయిన అర్షద్‌.. 82.75 మీటర్లు త్రో చేసి ఏకంగా పదో స్థానంలో నిలవడం గమనార్హం.


8వ స్థానానికి పరిమితమైన చోప్రా

గాయం దెబ్బతీసిందా..?

గతంలో ఎన్నడూ లేనంతగా నీరజ్‌ ఈసారి దారుణంగా విఫలమవడానికి కారణం అతను గాయానికి గురవడమేనని తెలుస్తోంది. టోర్నీకి రెండు వారాల ముందు నుంచే నీరజ్‌ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎ్‌ఫఐ) అధికారి ఒకరు వెల్లడించారు. ఒకరకంగా వెన్నునొప్పి కూడా తన ప్రదర్శనపై ప్రభావం చూపిందని ఫైనల్స్‌ ముగిసిన అనంతరం నీరజ్‌ తెలిపాడు. కాగా, గత ఏడేళ్లలో పోటీపడిన ప్రతి ఈవెంట్‌లోనూ పతకం గెలిచిన 27 ఏళ్ల నీరజ్‌.. ఓ టోర్నీలో పతకం లేకుండా రావడం ఇదే మొదటిసారి. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్‌.. గత పారిస్‌ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గాడు. ఇక, 2022 ప్రపంచ చాంపియన్‌షి్‌పలో రజతం గెలిచిన నీరజ్‌.. గత టోర్నీ (2023)లో పసిడి సాధించాడు.

నయా

సంచలనం

ప్రపంచ చాంపియన్‌షి్‌పలో నాలుగోస్థానంలో నిలిచి అబ్బురపరిచిన 25 ఏళ్ల సచిన్‌ యాదవ్‌.. ఉత్తరప్రదేశ్‌లోని ఖేక్రా గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో జన్మించాడు. ఆరడుగుల ఐదు అంగుళాల పొడవున్న సచిన్‌.. చిన్నప్పుడు ఫాస్ట్‌ బౌలర్‌ కావాలనుకొని ఆ దిశగా అడుగులేశాడు. కానీ, 19 ఏళ్ల వయసులో సందీప్‌ యాదవ్‌ అనే అథ్లెట్‌ మార్గదర్శకత్వంతో జావెలిన్‌ త్రోను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఈ ఏడాది మే నెలలో కొరియాలో జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌పలో జావెలిన్‌ను 86.27 మీటర్లు త్రో చేసి అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనతో రజతం నెగ్గాడు. అదే ఊపులో ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు అర్హత సాధించి క్వాలిఫికేషన్స్‌లో సత్తా చాటాడు. ఫైనల్లో నీరజ్‌ చోప్రా, వెబర్‌, జాకబ్‌ వాద్లెచ్‌, అర్షద్‌ నదీమ్‌లాంటి స్టార్లు తడబడిన చోట.. వారిని మించిన ప్రదర్శనతో ఆకట్టుకొని ఇప్పుడు జావెలిన్‌ త్రోలో నయా సంచలనంగా మారాడు.

00000-sports.jpg


0000-sports.jpg

48

సెకన్లలోపే..

అమెరికా స్టార్‌ అథ్లెట్‌ సిడ్నీ మెక్‌లానిన్‌ లివ్రోన్‌ 400 మీటర్ల రేసులో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భాగంగా గురువారం జరిగిన మహిళల 400 మీటర్ల రేసును మెక్‌లానిన్‌.. 47.78 సెకన్లలో ముగించి స్వర్ణం అందుకుంది. ఈ క్రమంలో గడచిన 40 ఏళ్లలో.. ఈ రేసును 48 సెకన్లలోపు పూర్తి చేసిన తొలి మహిళా అథ్లెట్‌గా 26 ఏళ్ల మెక్‌లానిన్‌ రికార్డుకెక్కింది. చివరిసారిగా 1985లో జర్మనీ అథ్లెట్‌ మరిటా కోచ్‌ 47.60 సెకన్లలో మహిళల 400 మీటర్ల రేసును పూర్తి చేసింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 06:15 AM