Neeraj Chopra Javelin Throw: వేటకు నీరజ్ రెడీ
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:02 AM
భారత పతక ఆశలు మోస్తున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరల్డ్ చాంపియన్‌షి్‌పలో డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగుతున్నాడు. బుఽధవారం క్వాలిఫయింగ్ రౌండ్ జరగనుంది. ఒలింపిక్ చాంప్...
నేడు జావెలిన్ త్రో క్వాలిఫికేషన్స్
ప్రపంచ అథ్లెటిక్స్
మ. 3.40 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో
టోక్యో: భారత పతక ఆశలు మోస్తున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరల్డ్ చాంపియన్‌షి్‌పలో డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగుతున్నాడు. బుఽధవారం క్వాలిఫయింగ్ రౌండ్ జరగనుంది. ఒలింపిక్ చాంప్ అర్షద్ నదీమ్, డైమండ్ లీగ్ విజేత జూలియన్ వెబర్, గ్రెనెడా స్టార్ అండర్సన్ పీటర్స్ తదితరుల నుంచి చోప్రాకు గట్టిపోటీ ఎదురుకానుంది. గ్రూప్-ఎలో చోప్రా, గ్రూప్-బిలో నదీమ్ ఉన్నారు. ఫైనల్ చేరితేనే వీరిద్దరూ ముఖాముఖిగా తలపడే అవకాశం ఉంది. ఫైనల్ గురువారం జరగనుంది. సచిన్ యాదవ్, రోహిత్ యాదవ్, యశ్‌వీర్ సింగ్ కూడా సత్తాచాటాలనుకొంటున్నారు. ఒకవేళ చోప్రా స్వర్ణం సాధిస్తే చెక్ లెజెండ్ జన్ జలెంజీ, అండర్సన్ పీటర్స్ తర్వాత టైటిల్‌ను నిలబెట్టుకొన్న మూడో అథ్లెట్‌గా రికార్డుకెక్కుతాడు.
టైటిళ్లు నిలబెట్టుకొన్న ఇథన్, ఫెయిత్: హ్యామర్ త్రోలో ఇథన్ కాట్జ్‌బర్గ్ (కెనడా), 1500 మీటర్లలో ఫెయిత్ కిప్‌యిగాన్ (కెన్యా) టైటిళ్లను నిలబెట్టుకొన్నారు. పురుషుల హ్యామర్ త్రో ఫైనల్లో ఇథన్ 84.70 మీటర్ల త్రోతో స్వర్ణంతోపాటు గేమ్స్ రికార్డును నెలకొల్పాడు. మహిళల 1500 మీ. ఫైనల్లో ఫెయిత్ 3 నిమిషాల 52.15 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం నెగ్గింది.
టాప్-6లో సర్వేష్
హైజంపర్ సర్వేష్ అనిల్ కుషారే పతకం నెగ్గకపోయినా.. వరల్డ్ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో టాప్ సిక్స్‌లో నిలిచిన నాలుగో భారత అథ్లెట్‌గా ఘనతను అందుకొన్నాడు. ఫైనల్లో 2.28 మీటర్ల ఎత్తు దూకిన సర్వేష్ ఓవరాల్‌గా ఆరో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత బెస్ట్ (2.27 మీటర్లు)ను అధిగమించాడు. హమీష్ (న్యూజిలాండ్- 2.36 మీ.) స్వర్ణం నెగ్గాడు.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి