Share News

Diamond League 2025: నీరజ్‌కు రెండో స్థానం

ABN , Publish Date - Aug 29 , 2025 | 02:20 AM

డైమండ్‌ లీగ్‌ ఫైనల్లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. గురువారం జరిగిన ఈవెంట్‌లో ఆరో, ఆఖరి ప్రయత్నంలో నీరజ్‌ 85.01 మీటర్ల దూరం విసిరాడు. తొలి ప్రయత్నంలోనే...

Diamond League 2025: నీరజ్‌కు రెండో స్థానం

డైమండ్‌ లీగ్‌ విజేత వెబర్‌

జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌): డైమండ్‌ లీగ్‌ ఫైనల్లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. గురువారం జరిగిన ఈవెంట్‌లో ఆరో, ఆఖరి ప్రయత్నంలో నీరజ్‌ 85.01 మీటర్ల దూరం విసిరాడు. తొలి ప్రయత్నంలోనే 84.35 మీటర్లు దూరం విసిరిన చోప్రా ఆ తర్వాత తడబడ్డాడు. రెండో త్రోలో 82 మీటర్లు మాత్రమే నమోదు చేసిన నీరజ్‌.. మూడు, నాలుగు, ఐదు త్రోలు ఫౌల్‌ చేశాడు. జర్మన్‌ త్రోయర్‌ జూలియన్‌ వెబర్‌ 91.51 మీటర్లతో విజేతగా నిలవగా.. ట్రిన్‌బాగో అథ్లెట్‌ కెషోర్న్‌ వాల్కాట్‌ 84.95 మీటర్ల దూరంతో మూడో స్థానం దక్కించుకొన్నాడు. మొదటి రెండు త్రోలు వెబర్‌ 91 మీటర్లకుపైగా విసరగా.. మిగతా వారు అతడి దారిదాపులకు కూడా చేరుకోలేక పోయారు.

ఇవి కూడా చదవండి

యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్‌ అవుట్‌

ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం

మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 02:20 AM