Asia Cup Trophy return: భారత్‌కు ట్రోఫీ ఇచ్చేందుకు పీసీబీ చీఫ్ సిద్ధమేకానీ ఒకే ఒక కండీషన్!
ABN , Publish Date - Sep 30 , 2025 | 03:59 PM
తన చేతుల మీదుగా అవార్డులు అందుకునేందుకు సిద్ధమంటేనే భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీ తిరిగిస్తానని పీసీబీ చీఫ్ మొహసీన్ నఖ్వీ టోర్నీ నిర్వాహకులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఇది ఎంత మాత్రం సాధ్యం కాదని భారత్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో పాక్ ఘోర ఓటమిని చవి చూసింది. అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది చాలదన్నట్టు పాక్ క్రికెట్ బోర్డు చీఫ్, దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సీన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోవడంతో యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. చివరకు కప్ లేకుండానే భారత్ విజయోత్సవాలు చేసుకుంది (Mohsin Naqvi Trophy Return Condition).
ఫైనల్స్ మ్యాచ్ ముగిసి రెండు రోజులు గడిచిపోయినా ఆసియా కప్ ట్రోఫీ భారత్ చెంతకు చేరలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందనేదానిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. టోర్నీ విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో ట్రోఫీకి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది (Asia Cup 2025 trophy row).
ఆసియా కప్ ట్రోఫీని భారత్‌కు తిరిగిచ్చేందుకు పీసీబీ చీఫ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. అధికారిక అవార్డు ప్రదాన కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్, ఇతర క్రీడాకారులు తన చేతుల మీదుగా అవార్డులు తీసుకుంటామంటేనే ట్రోఫీని తిరిగిస్తానని మొహ్సీన్ షరతు పెట్టారట. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంత మాత్రం సాధ్యం కాదని పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు (Asia Cup).
కాగా, పీసీబీ చీఫ్ తీరుపై బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా అంతకుమునుపు మండిపడ్డారు. పాకిస్థానీ రాజకీయ నేత నుంచి అవార్డు అందుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు. వీలైనంత త్వరగా ట్రోఫీ, మెడల్స్‌ను భారత్‌కు తిరిగిచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నవంబర్‌లో జరిగే ఐసీసీ సమావేశాల్లో ఈ ప్రస్తావన తెస్తామన్నారు. పీసీబీ చీఫ్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.
ఆదివారం ఫైనల్స్ అనంతరం విజేతలకు అవార్డులు ప్రదానం చేసేందుకు పీసీబీ చీఫ్ వేదికపైకి వచ్చారు. అయితే, తటస్థ అధికారి నుంచే బహుమతులను స్వీకరిస్తామని టీమిండియా స్పష్టం చేసింది. దీంతో, ఉక్కురోషం పట్టలేకపోయిన పీసీబీ చీఫ్ .. ఆసియా కప్ ట్రోఫీని, ఇతర మెడల్స్‌ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. పాక్ తీరుపై పూర్తి అవగాహన ఉన్న టీమిండియా సభ్యులు మాాత్రం విజయోత్సాహంలో మునిగితేలారు.
ఇవి కూడా చదవండి
ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ
భారత్‌ను రెచ్చగొట్టి పెద్ద తప్పు చేశారు.. పాక్ టీమ్‌పై అభిమానుల ఆగ్రహం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి