Share News

Mohammed Siraj Named ICC Player: ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ సిరాజ్‌

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:53 AM

భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆగస్టు మాసానికిగాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా ఎంపికయ్యాడు. వాస్తవానికి ఆగస్టు నెలలో అతను ఒక్క టెస్టే ఆడాడు...

Mohammed Siraj Named ICC Player: ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ సిరాజ్‌

దుబాయ్‌: భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆగస్టు మాసానికిగాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా ఎంపికయ్యాడు. వాస్తవానికి ఆగస్టు నెలలో అతను ఒక్క టెస్టే ఆడాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని ఆఖరిదైన ఐదో టెస్టులో సిరాజ్‌ ఏకంగా 9 వికెట్లు పడగొట్టి భారత్‌ను గెలిపించాడు. తద్వారా సిరీస్‌ కూడా 2-2తో సమమైంది. ఈ అద్భుత ప్రదర్శనతో అతడు న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ, వెస్టిండీస్‌ పేసర్‌ జేడెన్‌ సీల్స్‌ను వెనక్కి నెట్టి పురస్కారం అందుకున్నాడు. అటు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా ఎంపిక కావడం గర్వంగా ఉందని సిరాజ్‌ తెలిపాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 05:53 AM