Mithun Manhas Elected: బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్!
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:30 AM
బీసీసీఐ తదుపరి అధ్యక్షుడెవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ ప్రపంచ అత్యధిక ధనిక క్రికెట్ బోర్డు చీఫ్ కానున్నాడు....
ముగిసిన నామినేషన్ల గడువు
బరిలో ఢిల్లీ మాజీ క్రికెటర్ ఒక్కడే
ఏజీఎంలో అధికారిక ప్రకటన
ముంబై: బీసీసీఐ తదుపరి అధ్యక్షుడెవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ ప్రపంచ అత్యధిక ధనిక క్రికెట్ బోర్డు చీఫ్ కానున్నాడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలుకు ఆదివారం మధ్యాహ్నంతో గడువు ముగిసింది. అయితే మన్హాస్ ఒక్కడే నామినేషన్ వేయడంతో అతడి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. న్యూఢిల్లీలో శనివారం బీసీసీఐ పెద్దల సమావేశం జరిగింది. ఐసీసీ చీఫ్ జైషా, బీసీసీ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో మిథున్ పేరును ఖరారుచేసినట్టు సమాచారం. ఆ మేరకు అతడు నామినేషన్ దాఖలు చేశాడు.. ఇక..వచ్చే ఆదివారం ముంబైలో జరిగే బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా బోర్డులో మిగిలిన మరికొన్ని కీలక పదవులను కూడా భర్తీ చేస్తారట. భారత మాజీ ఆటగాడు, కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడు రఘురామ్ భట్ బోర్డు చీఫ్ పదవికి చివరి నిమిషం వరకూ పోటీపడ్డాడు. కానీ బోర్డు పెద్దలు నచ్చజెప్పడంతో అతడు రేస్‌నుంచి వైదొలగినట్టు సమాచారం. దాంతో రఘురామ్ భట్ బీసీసీఐ కోశాఽధికారి పదవికి నామినేషన్ వేశాడు. దేవజీత్ సైకియా కార్యదర్శిగా కొనసాగనున్నాడు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి