Mitchell Starc: టీ20లకు స్టార్క్ వీడ్కోలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:45 AM
మరో ఆరు నెలల్లో టీ20 వరల్డ్‌కప్ జరుగనుండగా.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే, టెస్టులపై మరింత దృష్టి సారించేందుకు అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు...
టెస్టు, వన్డేలపై దృష్టి
సిడ్నీ: మరో ఆరు నెలల్లో టీ20 వరల్డ్‌కప్ జరుగనుండగా.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే, టెస్టులపై మరింత దృష్టి సారించేందుకు అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడంతో పాటు డెత్ ఓవర్లలో యార్కర్లతో 35 ఏళ్ల ఈ లెఫ్టామ్ పేసర్ బ్యాటర్లను బెంబేలెత్తించగలడు. 2012లో టీ20 అరంగేట్రం చేసిన తను కెరీర్‌లో ఆడిన 65 మ్యాచ్‌ల్లో 79 వికెట్లు తీశాడు. అలాగే ఇప్పటిదాకా జరిగిన ఆరు టీ20 వరల్డ్‌క్‌పల్లో తను ఐదింటిలో ఆడడం విశేషం. గతేడాది జరిగిన మెగా టోర్నీలో ఆసీస్ తరఫున చివరిసారి పాల్గొన్నాడు. అలాగే 2021 టీ20 వరల్డ్‌క్‌పలో ఆసీ్‌సను విజేతగా నిలపడంలోనూ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. ‘టెస్టు క్రికెట్‌కే నా ప్రాధాన్యత. అలాగే ఆసీస్ తరఫున ఆడిన ప్రతీ టీ20 మ్యాచ్‌ను ఆస్వాదించాను. ముఖ్యంగా 2021 టీ20 వరల్డ్‌క్‌పను మరింత బాగా ఎంజాయ్ చేశాను. ఇక భారత్‌లో ఐదు టెస్టుల సిరీస్, యాషెస్, వన్డే వరల్డ్‌కప్ ఇలా బిజీ షెడ్యూల్ ముందుంది. వీటి కోసం ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను. అలాగే వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఉండడంతో యువ బౌలర్లను ఎంపిక చేసుకునేందుకు తగిన సమయం ఇవ్వాలనే ఆలోచనతో రిటైర్ అవుతున్నా’ అని స్టార్క్ పేర్కొన్నాడు. మరోవైపు ఫ్రాంచైజీ క్రికెట్‌పై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్‌ల్లో కొనసాగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి