Share News

Dropped from 2028 Olympics: 2028 ఒలింపిక్స్‌ నుంచి మీరాబాయి కేటగిరి తొలగింపు

ABN , Publish Date - Nov 05 , 2025 | 03:32 AM

భారత స్టార్‌ లిఫ్టర్‌, టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత మీరాబాయి చాను ప్రస్తుతం పోటీపడుతున్న 49 కిలోల బరువు విభాగాన్ని వచ్చే 2027 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌ నుంచి తొలగించారు....

Dropped from 2028 Olympics: 2028 ఒలింపిక్స్‌ నుంచి మీరాబాయి కేటగిరి తొలగింపు

53 కిలోలకు మారనున్న భారత లిఫ్టర్‌

న్యూఢిల్లీ: భారత స్టార్‌ లిఫ్టర్‌, టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత మీరాబాయి చాను ప్రస్తుతం పోటీపడుతున్న 49 కిలోల బరువు విభాగాన్ని వచ్చే 2027 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌ నుంచి తొలగించారు. విశ్వక్రీడల మహిళల విభాగంలో వెయిట్‌ లిఫ్టింగ్‌ ఈవెంట్లను 12 (పురుషులు 6, మహిళలు 6)కు పెంచడంలో భాగంగా ఇప్పటిదాకా ఉన్న అతి తక్కువ వెయిట్‌ కేటగిరిని 49 నుంచి 53 కిలోలకు ఐఓసీ మార్చినట్టు అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) తెలిపింది. వాస్తవానికి మీరాబాయి.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 49 కిలోల విభాగంలోనే రజతం సాధించింది. ఐఓసీ తాజా నిర్ణయంతో రానున్న ఒలింపిక్స్‌లో మీరా 53 కిలోల విభాగం నుంచి బరిలోకి దిగే అవకాశముంది. అయితే వచ్చే ఏడాది ఆసియా క్రీడల వరకు మీరా, తన పాత కేటగిరి 49 కిలోల్లోనే పోటీపడుతుంది. తాజా ఐఓసీ నిర్ణయం ప్రకారం వచ్చే ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల విభాగం నుంచి 53, 61, 69, 77, 86, 86+ కిలోలు, పురుషుల తరఫున 65, 75, 85, 95, 110, 110+ కిలోల విభాగాల్లో లిఫ్టర్లు పోటీపడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి...

వ్యవసాయ రంగం అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి మూలం: కిషన్‌రెడ్డి

ఒక్క ఛాన్స్ అని.. తెలంగాణని దివాళా తీయించారు.. సీఎం రేవంత్‌‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 03:32 AM