Commonwealth Weightlifting 2025: చాను రికార్డు స్వర్ణం
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:44 AM
గాయం నుంచి కోలుకొని ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టోక్యో ఒలింపిక్స్ రజత పతక వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు బ్రేకింగ్ ప్రదర్శనతో అదరగొట్టింది. సోమవారం జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షి్‌ప మహిళల 48 కిలోల విభాగంలో చాను...
తెలుగమ్మాయి భవానికి రజతం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్
అహ్మదాబాద్: గాయం నుంచి కోలుకొని ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టోక్యో ఒలింపిక్స్ రజత పతక వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు బ్రేకింగ్ ప్రదర్శనతో అదరగొట్టింది. సోమవారం జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షి్‌ప మహిళల 48 కిలోల విభాగంలో చాను.. స్నాచ్‌లో 84 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కిలోలతో మొత్తం 193 కిలోల బరువు ఎత్తి స్వర్ణం సొంతం చేసుకొంది. ఎత్తిన చాను కామన్వెల్త్ రికార్డులను బద్దలుకొట్టింది. ఓవరాల్‌గా గతంలో కంటే అధికంగా 14 కిలోల బరువు ఎత్తింది. మలేసియా లిఫ్టర్ ఐరెనీ హెన్రీ 161 (73+88) కిలోలు ఎత్తి రజతం, వేల్స్ లిఫ్టర్ నికోల్ రాబర్ట్స్ 150 (70+80) కిలోలు లిఫ్ట్ చేసి కాంస్యం దక్కించుకొన్నారు. పురుషుల 60 కిలోల కేటగిరీలో జాతీయ క్రీడల చాంపియన్ రిషికాంత్ సింగ్ 271 (120+151) కిలోలు ఎత్తి బంగారు పతకం నెగ్గాడు. గతంలో మీరాబాయి 49 కిలోల కేటగిరీలో పోటీపడేది. అయితే, విశ్వక్రీడల నుంచి ఆ విభాగాన్ని తొలగించడంతో 48 కిలోల విభాగానికి మారింది.

ఇక, ఇదే టోర్నీ సబ్ జూనియర్ విభాగంలో తెలుగమ్మాయి రెడ్డి భవాని పతకంతో సత్తా చాటింది. ఏపీలోని విజయనగరానికి చెందిన భవాని మహిళల 48 కిలోల కేటగిరిలో రజత పతకం గెలుచుకుంది. స్నాచ్‌లో 66 కిలోలు ఎత్తిన భవాని.. క్లీన్ అండ్ జెర్క్‌లో 92 కిలోలు లిఫ్ట్ చేసింది. దీంతో ఓవరాల్‌గా 158 కిలోల బరువుతో భవాని రెండోస్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి..
యూఎస్ ఓపెన్‌లో హైడ్రామా.. రాకెట్‌ను విరగ్గొట్టిన డానియెల్ మెద్వదేవ్.. వీడియో వైరల్..
ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..