Australia Cricket Win: మ్యాక్స్‌వెల్ మెరుపుల్
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:40 AM
నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 62 నాటౌట్) అర్ధ శతకంతో మెరవడంతో.. దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం..
మూడో టీ20లో సఫారీలపై ఆసీస్ గెలుపు
2-1తో సిరీస్ కైవసం
కెయిన్స్: నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 62 నాటౌట్) అర్ధ శతకంతో మెరవడంతో.. దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీ్‌సను 2-1తో సొంతం చేసుకొంది. చివరి రెండు బంతుల్లో ఆసీస్ గెలుపునకు 4 పరుగులు కావాల్సి ఉండగా.. ఎన్‌గిడి బౌలింగ్‌లో మ్యాక్సీ రివర్స్ స్వీప్ బౌండ్రీతో జట్టుకు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. శనివారం జరిగిన సిరీస్ నిర్ణాయక మ్యాచ్‌లో తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 172/7 స్కోరు చేసింది. డివాల్డ్ బ్రెవిస్ (53), డుస్సెన్ (38 నాటౌట్) రాణించారు. నాథన్ ఎల్లీస్ 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ఆసీస్ 19.5 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మార్ష్ (54) హాఫ్ సెంచరీ సాధించాడు. కొర్బిన్ బాష్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆసీ్‌సకు ఇది వరుసగా ఏడో ద్వైపాక్షిక టీ20 సిరీస్ విజయం కావడం విశేషం.
ఇవి కూడా చదవండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి