Fitness Rules Under Fire: రోహిత్‌ను సాగనంపేందుకే
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:14 AM
భారత క్రికెటర్లను మరింత ఫిట్‌గా ఉంచే ప్రక్రియలో బీసీసీఐ ఇటీవల కొత్తగా బ్రాంకో టెస్టును ప్రవేశపెట్టింది. అయితే వెటరన్ స్టార్ రోహిత్ శర్మను జట్టులోంచి తప్పించేందుకు ఈ టెస్టును తీసుకువచ్చారని...
బ్రాంకో టెస్టుపై మనోజ్ తివారీ
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లను మరింత ఫిట్‌గా ఉంచే ప్రక్రియలో బీసీసీఐ ఇటీవల కొత్తగా బ్రాంకో టెస్టును ప్రవేశపెట్టింది. అయితే వెటరన్ స్టార్ రోహిత్ శర్మను జట్టులోంచి తప్పించేందుకు ఈ టెస్టును తీసుకువచ్చారని మాజీ ఆటగాడు మనోజ్ తివారీ సంచలన ఆరోపణ చేశాడు. ‘2027 వన్డే వరల్డ్‌కప్ జట్టులో విరాట్‌ను తీసుకోకుండా ఉండలేరు. అతడి ఫిట్‌నెస్ స్థాయి అలాంటిది. కానీ రోహిత్‌ను పక్కనబెట్టాలని బోర్డు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. అందుకే కొన్ని రోజుల క్రితం కఠినమైన బ్రాంకో టెస్టును ప్రవేశపెట్టారు. రోహిత్ శరీరతత్వం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కచ్చితంగా తను ఈ టెస్టులో పాస్ అవలేడు. కోచ్ గంభీర్ ఇప్పుడే దీన్ని ఎందుకు అమలు చేయాలనుకుంటున్నాడో అర్థమవుతుంది’ అని తివారీ వివరించాడు. అలాగే తాను శ్రీలంక పర్యటనలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించినా జట్టులో చోటు దక్కలేదని, బహుశా అప్పటి కెప్టెన్ ధోనీకి నచ్చలేదేమోనని తెలిపాడు.
ఇవి కూడా చదవండి..
యూఎస్ ఓపెన్‌లో హైడ్రామా.. రాకెట్‌ను విరగ్గొట్టిన డానియెల్ మెద్వదేవ్.. వీడియో వైరల్..
ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..