Share News

Asia Cup Hockey: మన్‌దీప్ గోల్‌తో గట్టెక్కింది

ABN , Publish Date - Sep 04 , 2025 | 06:02 AM

ఆట ముగిసేందుకు మరో ఎనిమిది నిమిషాలే ఉంది. స్కోరు చూస్తే భారత్‌ 1-2తో కొరియాతో సూపర్‌ ఫోర్‌ తొలి మ్యాచ్‌లో వెనుకంజలో ఉంది. దాంతో ఆసియా కప్‌ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్‌కు తొలి పరాజయం తప్పదేమో...

Asia Cup Hockey: మన్‌దీప్ గోల్‌తో గట్టెక్కింది

కొరియాతో భారత్‌ మ్యాచ్‌ డ్రా

ఆసియా కప్‌ హాకీ

రాజ్‌గిర్‌ (బిహార్‌): ఆట ముగిసేందుకు మరో ఎనిమిది నిమిషాలే ఉంది. స్కోరు చూస్తే భారత్‌ 1-2తో కొరియాతో సూపర్‌ ఫోర్‌ తొలి మ్యాచ్‌లో వెనుకంజలో ఉంది. దాంతో ఆసియా కప్‌ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్‌కు తొలి పరాజయం తప్పదేమో అనిపించింది. కానీ ఈ దశలో ఫార్వర్డ్‌ మన్‌దీప్‌ సింగ్‌ మాయ చేశాడు. లెఫ్ట్‌ ఫ్లాంక్‌ నుంచి హర్మన్‌ప్రీత్‌ అందించిన రివర్స్‌ పాస్‌ను సుఖ్‌జీత్‌ సింగ్‌..మన్‌దీ్‌ప వైపు కొట్టాడు. బంతిని అందుకున్న మన్‌దీ్‌ప నలుగురు కొరియా డిఫెండర్లను బోల్తాకొట్టిస్తూ గోల్‌పో్‌స్టలోకి పంపాడు. అంతే..స్కోరు 2-2తో సమం. భారత ఫ్యాన్స్‌లో ఆనందం. సూపర్‌-4లో భాగంగా కొరియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌ను భారత్‌ డ్రా చేసింది. దాంతో టోర్నమెంట్‌లో అపజయమెరుగని రికార్డును ఆతిథ్య జట్టు కొనసాగించింది. ఎనిమిదో నిమిషంలోనే హార్దిక్‌ సింగ్‌ గోల్‌ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. యాంగ్‌ జిహున్‌ (12) గోల్‌తో స్కోరు సమం చేసిన కొరియా..కొద్ది సేపటికే కిమ్‌ (14) సాధించిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. డ్రా దరిమిలా రెండు జట్లు చెరో పాయింట్‌ దక్కించుకున్నాయి. మరో సూపర్‌ ఫోర్‌ పోరులో మలేసియా 2-0తో చైనాను చిత్తు చేసింది. ఇక గురువారం జరిగే సూపర్‌-4 రెండో మ్యాచ్‌లో మలేసియాను భారత్‌ ఢీకొంటుంది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2025 | 06:02 AM