Lionel Messis Star Studded India Tour: మెస్సీ ర్యాంప్ వాక్
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:53 AM
మూడు రోజుల పర్యటనలో దేశం నలుదిక్కులను మెస్సీ చుట్టేయనున్నాడు. కోల్‌కతాలో తన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా.. భాగ్యనగరంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌తో ఫ్యాన్స్‌ను...
సువారెజ్, జాన్ అబ్రహాం కూడా..
తారాతోరణం కనువిందు
3 రోజుల్లో.. హైదరాబాద్‌కు
మూడు రోజుల పర్యటనలో దేశం నలుదిక్కులను మెస్సీ చుట్టేయనున్నాడు. కోల్‌కతాలో తన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా.. భాగ్యనగరంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించనున్నాడు. తర్వాతి రోజు ముంబై ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్..చివరగా ఢిల్లీలో మోదీని కలిసిన అనంతరం గ్రాండ్‌గా భారత్‌కు బై..బై!
కోల్‌కతా: భారత పర్యటనలో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఓ ఫ్యాషన్ షోలో పాల్గొననున్నాడు. స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాల సేకరణలో భాగంగా ఆదివారం ముంబైలో ఈ ర్యాంప్ వాక్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రమోటర్ దత్తా మంగళవారమిక్కడ తెలిపాడు. ముంబై లెగ్‌ను వాంఖడే స్టేడియంలో 14వ తేదీ సాయంత్రం 5 నుంచి షెడ్యూల్ చేశారు. 45 నిమిషాలపాటు సాగే ఫ్యాషన్ షోలో ఉరుగ్వే మాజీ స్ట్రయికర్ లూయిస్ సువారెజ్, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ రోడ్రిగో డి పాల్‌తో కలసి మెస్సీ ర్యాంప్ వాక్ చేయనున్నట్టు దత్తా చెప్పాడు. ప్రముఖ క్రికెటర్లు, మోడల్స్‌తోపాటు బాలీవుడ్ నటులు టైగర్, జాకీ ష్రాఫ్, జాన్ అబ్రహాం కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అంతేకాకుండా స్పానిష్ మ్యూజిక్ షోలో కూడా సువారెజ్ భాగం కానున్నాడు. 2022 వరల్డ్‌కప్‌నకు సంబంధించిన మెస్సీ జ్ఞాపికలను వేలానికి ఉంచే చాన్సుంది.
70 అడుగుల విగ్రహావిష్కరణ..
వాస్తవంగా మెస్సీ మూడు రోజుల పర్యటన కోల్‌కతా నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం అర్ధరాత్రి అతడు ఇక్కడకు చేరుకోనున్నాడు. శ్రీభూమిలో ఏర్పాటు చేసిన 70 అడుగుల తన విగ్రహాన్ని మెస్సీ ఆవిష్కరించాల్సి ఉంది. కానీ, భద్రతాపరమైన కారణాల రీత్యా హోటల్ నుంచే వర్చువల్‌గా మెగా విగ్రహాన్ని మెస్సీ ఆవిష్కరించనున్నాడు. ఫైబర్ గ్లాస్‌తో నిర్మిస్తున్న ఈ విగ్రహం కోసం దాదాపు రెండు నెలలుగా కార్మికులు శ్రమిస్తున్నారు. శనివారం ఉదయం 9.30 నుంచి 10.30 వరకు అతిథుల మీట్ అండ్ గ్రీట్ జరగనుండగా.. అర్జెంటీనా-భారత్ ఫుడ్‌ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తర్వాత మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియం చేరుకోనున్నాడు. ఇక్కడ భారీ చిత్రాన్ని కూడా మెస్సీకి బహూకరించే అవకాశం ఉందని దత్తా చెప్పాడు. ఆ తర్వాత 2 గంటలకు హైదరాబాద్ పయనమవుతాడని తెలిపాడు. సౌత్ టూర్‌లో భాగంగా రాత్రి 7 గంటలకు ఉప్పల్‌లో జరిగే ‘గోట్’కప్’లో మెస్సీ పాల్గొననున్నాడు. 7-7 సెలెబ్రిటీ మ్యాచ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలసి మెస్సీ ఆడనున్నాడు. మెస్సీ రాకను పురస్కరించుకొని సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేశారు.
ఆఖర్లో మోదీని కలసి..
టూర్ ముగింపులో భాగంగా సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుసుకోనున్నాడు. మెనిర్వా అకాడమీ యూత్ టీమ్‌ను కూడా లియోనెల్ సన్మానించనున్నాడు. 9 మంది సభ్యుల సెలెబ్రిటీ మ్యాచ్‌లో కూడా పాల్గొనే చాన్సుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా
Read Latest AP News And Telugu News