GOAT Tour 2025: లియోనల్ మెస్సీ గోట్ టూర్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:35 AM
ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ భారత్ రానున్నారు. హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు.
ప్రపంచ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు ప్రముఖ నగరాల్లో పర్యటిస్తారు. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలలో జరగబోయే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు. మెస్సీతో పాటు లూయిస్ సూరెజ్, అర్జెంటినా మిడ్ ఫీల్డర్ రోడ్రిగో డే పాల్‌లు కూడా భారత్‌లో పర్యటించనున్నారు. మెస్సీ మూడు రోజుల భారత్ టూర్ షెడ్యూల్ ఇలా ఉంది..
డిసెంబర్ 13, కోల్‌కతా..
తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతాల్లో కోల్‌కతా చేరుకుంటారు.
ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఉంటుంది.
10.30 నుంచి 11.15 గంటల వరకు వర్చ్యువల్‌గా మెస్సీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
11.15 నుంచి 11.25 వరకు యువ భారతికి వెళతారు.
11.30 గంటలకు షారుఖ్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
12 గంటలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరభ్ గంగూలీ స్టేడియం దగ్గరకు వస్తారు.
12 గంటల నుంచి 12.30 గంటల వరకు ఫ్రెండ్లీ మ్యాచ్, సన్మానం, ఇంటరాక్షన్ ఉంటుంది.
2.00 గంటలకు హైదరాబాద్ బయలు దేరతారు.
డిసెంబర్ 13, హైదరాబాద్..
రాత్రి 7.00 గంటల ప్రాంతంలో రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మ్యాచ్ ఆడనున్నారు.
అనంతరం మ్యూజికల్ కంసర్ట్‌లో పాల్గొంటారు.
డిసెంబర్ 14, ముంబై..
3.30 గంటల కు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే పడేల్ కప్‌లో పాల్గొంటారు.
4.00 గంటలకు సెలెబ్రిటీ ఫుట్ బాల్ మ్యాచ్ ఉంటుంది.
5.00 వాఖాండే స్టేడియంలో ఛారిటీ ఫ్యాషన్ షో ఉంటుంది.
డిసెంబర్ 15, న్యూఢిల్లీ
ప్రధాని నరేంద్ర మోదీతో మెస్సీ భేటీ కానున్నారు.
1.30 గంటల ప్రాంతంలో అర్జున్ జైట్లీ స్టేడియంలో జరగబోయే మినర్వా అకాడమీ ప్లేయర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి
సుప్రీం ఆదేశం.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్
వీడు మామూలోడు కాదుగా.. పగలు రెక్కీ.. రాత్రి చోరీ