Lara Volvaard Breaks Record: సౌతాఫ్రికా కెప్టెన్ సరికొత్త రికార్డు
ABN , Publish Date - Oct 30 , 2025 | 02:52 PM
బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ లో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టును కెప్టెన్ లారా వోల్వార్డ్ ముందుండి నడిపించింది. ఆమె ఇన్నింగ్స్(169 పరుగులు) అద్భుతంగా ఉంది . పవర్ ప్లే అంతటా ఆమె స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
క్రీడా వార్తలు: మహిళల ప్రపంచ కప్(Women's World Cup 2025)లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. అక్టోబర్ 29న జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ లో మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి తన తొలి ప్రపంచ కప్ సెంచరీ కలను నెరవేర్చుకుంది. ఆమె ఇన్నింగ్స్‌ను టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur), అలిస్సా హీలీ వంటి దిగ్గజాల నాకౌట్ స్కోర్లతో పోల్చడం జరిగింది. మరి..ఆమెను హర్మన్ ప్రీత్, అలిస్సాతో ఎందుకు పోల్చారు?. ఆ సాధించిన రికార్డు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ లో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టును కెప్టెన్ లారా వోల్వార్డ్(Lara Volvaard Century) ముందుండి నడిపించింది. ఆమె ఇన్నింగ్స్(169 పరుగులు) అద్భుతంగా ఉంది. పవర్ ప్లే అంతటా ఆమె స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ, ఆమె ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. మంచి స్ట్రైక్ రేట్‌ను కొనసాగించింది. అంతేకాక ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది.
ఇంగ్లాండ్ తో జరిగిన ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో లారా వోల్వార్డ్ సాధించిన సెంచరీ(169) ఓ రికార్డును బద్ధలు కొట్టింది. మహిళల ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ లో సెంచరీ సాధించిన తొలి కెప్టెన్‌గా ఆమె(Lara Volvaard Century) చరిత్ర సృష్టించింది. ఈ ఇన్నింగ్స్ తో ఆమె వన్డే సెంచరీల సంఖ్య 10కి చేరింది. దీని ద్వారా మహిళల వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల ఆల్-టైమ్ జాబితాలో ఆమె ఉమ్మడిగా ఐదో స్థానంలో నిలిచింది. మహిళల ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ (171*), అలిస్సా హీలీ(Alyssa Healy)(170) తర్వాత లారా వోల్వార్డ్ నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Gold Price Today: ఇవాళ్టి మార్కెట్లో బంగారం ధరలు
Australian cricketer: విషాదం.. ఆసీస్ యువ క్రికెటర్ మృతి