FIDE World Cup: లలిత్ రిత్విక్ పరాజయం
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:46 AM
ఫిడే వరల్డ్‌క్‌పలో తెలుగు జీఎంలు లలిత్ బాబు, రాజా రిత్విక్ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లోని రెండు క్లాసిక్ గేమ్‌లను ఈ ఇరువురు డ్రా చేసుకోవడంతో...
చెస్ ప్రపంచ కప్
పనాజీ (గోవా): ఫిడే వరల్డ్‌క్‌పలో తెలుగు జీఎంలు లలిత్ బాబు, రాజా రిత్విక్ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లోని రెండు క్లాసిక్ గేమ్‌లను ఈ ఇరువురు డ్రా చేసుకోవడంతో సోమవారం టైబ్రేకర్ నిర్వహించారు. ఇందులో ఇద్దరూ పోరాడి ఓడారు. జీఎం లలిత్ బాబు (విజయవాడ) ర్యాపిడ్ రెండు గేములను కూడా డ్రా చేయడంతో తొలుత 2-2తో వామర్‌డామ్ (నెదర్లాండ్స్)తో సమంగా నిలిచాడు. ఆ తర్వాత నిర్వహించిన రెండో టైబ్రేకర్ బ్లిట్జ్‌లో ఓడి 3-5తో పోటీల నుంచి నిష్క్రమించాడు. రాజా రిత్విక్ (కరీంనగర్) ర్యాపిడ్ రెండు గేములను డ్రా చేసుకుని 2-2తో నోజర్‌బెక్ (కజకిస్థాన్)తో సమంగా నిలవగా ఆ తర్వాత జరిగిన రెండో టైబ్రేకర్ బ్లిట్జ్‌లో ఓడి 3-5తో పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇతర భారత గ్రాండ్‌మాస్టర్లలో తెలుగు క్రీడాకారుడు కార్తీక్‌తో పాటు సూర్య శేఖర్ గంగూలీ, వి.ప్రణవ్, రౌనక్, ప్రాణేష్, ఇనియాన్ రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. ఇక, తొలి రౌండ్‌లో బై లభించిన స్టార్ ప్లేయర్లు గుకేష్, ప్రజ్ఞానంద, అర్జున్ రెండో రౌండ్‌లో పోటీ పడనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కృత్రిమ మేధస్సుతో అడవి ఏనుగుల సమస్య పరిష్కారం: పవన్ కల్యాణ్
మంచి వెనకే చెడు.. అంతా డైవర్ట్ కోసమేనా?.. వర్మ అనుమానాలు
Read Latest AP News And Telugu News