World Badminton Championship: లక్ష్య సేన్‌కు నిరాశ
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:11 AM
వరల్డ్ చాంపియన్‌షి్‌పలో భారత ఏస్ షట్లర్ లక్ష్య సేన్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో సేన్ 17-21, 19-21తో వరల్డ్ నెం.1 షి యు కి (చైనా) చేతిలో పోరాడి...
తొలిరౌండ్లోనే వెనుదిరిగిన భారత స్టార్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
పారిస్: వరల్డ్ చాంపియన్‌షి్‌పలో భారత ఏస్ షట్లర్ లక్ష్య సేన్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో సేన్ 17-21, 19-21తో వరల్డ్ నెం.1 షి యు కి (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌లో ఆరంభంలో ఇద్దరూ 6-6తో సమవుజ్జీలుగా కనిపించినా.. వరుసగా 4 పాయింట్లు సాధించిన షి యు 11-9తో బ్రేక్‌కు వెళ్లాడు. తర్వాత 11-11తో సేన్ సమం చేసినా.. వరుసగా ఐదు పాయింట్లు స్కోరు చేసిన చైనా షట్లర్ 16-11తో మెరుగైన ఆధిక్యం సాధించాడు. అదే జోరులో తొలి గేమ్‌ను నెగ్గాడు. రెండో గేమ్‌లో 9-11తో వెనుకంజలో ఉన్న సమయంలో పుంజుకొన్న సేన్ 16-16తో సమం చేశాడు. ఆ తర్వాత షి యు ఆధిక్యంలోకి దూసుకెళ్లినా.. సేన్ 19-19తో మరోసారి సమం చేశాడు. అయితే, కీలక సమయంలో సేన్ అనవసర తప్పిదాలతో మ్యాచ్ చైనా షట్లర్ సొంతమైంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో రుతుపర్ణ-శ్వేతపర్ణ జంట 12-21, 11-21తో బల్గేరియా జోడీ గాబ్రియెలా-స్టెఫానీ చేతిలో, ప్రియ-శ్రుతి మిశ్రా ద్వయం 17-21, 16-21తో ఫ్రాన్స్ జంట మార్గాట్ లాంబర్ట్-కమెల్లీ చేతిలో పరాజయం పాలయ్యారు.
ఇవి కూడా చదవండి..
యూఎస్ ఓపెన్‌లో హైడ్రామా.. రాకెట్‌ను విరగ్గొట్టిన డానియెల్ మెద్వదేవ్.. వీడియో వైరల్..
ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..