Share News

China Masters 2025: చైనా మాస్టర్స్‌ పై లక్ష్య, సాత్విక్‌ గురి

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:42 AM

చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టైటిల్‌పై భారత షట్లర్లు లక్ష్యసేన్‌, సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ గురి పెట్టారు. మంగళవారం షెన్‌జెన్‌ వేదికగా ఈ పోటీలు ప్రారంభమవనున్నాయి...

China Masters 2025: చైనా మాస్టర్స్‌ పై లక్ష్య, సాత్విక్‌ గురి

షెన్‌జెన్‌: చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టైటిల్‌పై భారత షట్లర్లు లక్ష్యసేన్‌, సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ గురి పెట్టారు. మంగళవారం షెన్‌జెన్‌ వేదికగా ఈ పోటీలు ప్రారంభమవనున్నాయి. ఇటీవల ముగిసిన హాంకాంగ్‌ ఓపెన్‌లో సేన్‌ ఫైనల్‌ చేరి రన్నర్‌పగా నిలిచాడు. ఫామ్‌ కోల్పోయిన తర్వాత గత రెండేళ్లలో ఒక ప్రధాన టోర్నీలో సేన్‌ ఫైనల్‌ చేరడం అదే తొలిసారి. డబుల్స్‌లో ఈ సీజన్‌లో ఆరు టోర్నీల్లో సెమీస్‌, హాంకాంగ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన సాత్విక్‌ జోడీ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. మహిళల సింగిల్స్‌లో 30 ఏళ్ల పీవీ సింధు, డబుల్స్‌లో రుతపర్ణ, శ్వేతపర్ణ, మిక్స్‌డ్‌లో రోహన్‌-రుత్విక శివానీ, ధ్రువ్‌-తనీషా జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 05:42 AM