Share News

Canada Open Badminton: సెమీస్‌లో శ్రీకాంత్‌ ఓటమి

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:25 AM

భారత సీనియర్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌కు కెనడా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో చుక్కెదురైంది. శనివారం రాత్రి జరిగిన సింగిల్స్‌ సెమీఫైనల్లో...

Canada Open Badminton: సెమీస్‌లో శ్రీకాంత్‌ ఓటమి

కాల్గెరి (కెనడా): భారత సీనియర్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌కు కెనడా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో చుక్కెదురైంది. శనివారం రాత్రి జరిగిన సింగిల్స్‌ సెమీఫైనల్లో శ్రీకాంత్‌ 21-19, 14-21, 18-21తో మూడోసీడ్‌ కెంటా నిషిమొటో (జపాన్‌)తో పరాజయం పాలయ్యాడు. కాగా, అంతకుముందు శ్రీకాంత్‌ 21-18, 21-9తో టాప్‌సీడ్‌, ప్రపంచ ఆరో ర్యాంకర్‌ చో తిన్‌ (చైనీస్‌ తైపీ)ను చిత్తుచేసి సెమీస్‌ చేరాడు. ఇక, మరో భారత ఆటగాడు శంకర్‌ ముత్తుస్వామి క్వార్టర్స్‌లో 15-21, 21-5, 17-21తో నిషిమొటో చేతిలో ఓటమిపాలయ్యాడు.

ఇవీ చదవండి:

ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్

సంజూ శాంసన్‌కు జాక్‌పాట్

టచ్ చేయలేని రికార్డులు!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 03:25 AM