Share News

Kidambi Srikanth Hong Kong Open: శ్రీకాంత్‌ అవుట్‌

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:27 AM

ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌కు హాంకాంగ్‌ ఓపెన్‌లో చుక్కెదురైంది. మెయిన్‌ డ్రా కూడా చేరకుండా క్వాలిఫయర్స్‌లోనే ...

Kidambi Srikanth Hong Kong Open: శ్రీకాంత్‌ అవుట్‌

  • ‘హాంకాంగ్‌’లో సాత్విక్‌ జోడీ ముందంజ

హాంకాంగ్‌: ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌కు హాంకాంగ్‌ ఓపెన్‌లో చుక్కెదురైంది. మెయిన్‌ డ్రా కూడా చేరకుండా క్వాలిఫయర్స్‌లోనే కంగుతిన్నాడు. క్వాలిఫయర్స్‌ ఆరంభ రౌండ్లో భారత్‌కే చెందిన తరుణ్‌ మన్నెపల్లి 28-26, 21-13తో కిడాంబికి షాకిచ్చి సంచలనం సృష్టించాడు. అయితే, ఆ తర్వాత జరిగిన ఫైనల్‌ రౌండ్లో తరుణ్‌ 23-21, 13-21, 18-21తో జస్టిన్‌ హాన్‌ (మలేసియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌ మెయిన్‌ డ్రా తొలి రౌండ్లో స్టార్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌ శెట్టి 21-13, 18-21, 21-10తో తైవాన్‌ ద్వయం సియాంగ్‌/వాంగ్‌ లిన్‌పై గెలిచింది. సింగిల్స్‌లో కిరణ్‌ జార్జ్‌ మెయిన్‌ డ్రాకు చేరాడు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 05:27 AM