SA tour of Australia 2025: కేశవ్ పాంచ్
ABN , Publish Date - Aug 20 , 2025 | 02:49 AM
ఆస్ట్రేలియా పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా ఘనంగా బోణీ చేసింది. మంగళవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో లెఫ్టామ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (5/33) కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేయడంతో...
తొలి వన్డేలో ఆసీ్‌సకు దక్షిణాఫ్రికా షాక్
కెయిన్స్: ఆస్ట్రేలియా పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా ఘనంగా బోణీ చేసింది. మంగళవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో లెఫ్టామ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (5/33) కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేయడంతో సఫారీ జట్టు 98 పరుగుల తేడాతో ఆతిథ్య ఆసీ్‌సకు షాకిచ్చింది. తొలుత దక్షిణాఫ్రికా.. ఓపెనర్ మార్‌క్రమ్ (82), కెప్టెన్ బవుమా (65), మాథ్యూ బ్రెజెకె (57) అర్ధ సెంచరీలతో 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. హెడ్ 4, డ్వార్షూయిస్ 2 వికెట్లు తీశారు. ఛేదనలో సఫారీ బౌలర్లు కేశవ్‌కు తోడు ఎంగిడి (2/28), బర్గర్ (2/54) ధాటికి ఆసీస్ 40.5 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. సారథి మిచెల్ మార్ష్ (88) ఒంటరి పోరాటం చేశాడు. ఐదు వికెట్లతో అదరగొట్టిన కేశవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News