Kadapa Dynamite Sricharani Shines: భయపడలేదు
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:03 AM
లీగ్ దశలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో మనం పరాజయం పాలయ్యాం. అయితే, ఆ ఫలితాలను మనసులో పెట్టుకొని సెమీస్, ఫైనల్లో వారితో తలపడినప్పుడు ఒత్తిడికి లోనుకాలేదు...
లీగ్ దశలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో మనం పరాజయం పాలయ్యాం. అయితే, ఆ ఫలితాలను మనసులో పెట్టుకొని సెమీస్, ఫైనల్లో వారితో తలపడినప్పుడు ఒత్తిడికి లోనుకాలేదు. ప్రధానంగా సెమీ్‌సకు ముందు.. ఎన్నో వరల్డ్‌క్‌పలు గెలిచిన ఆసీస్‌పై భారత్ గెలుస్తుందా అనే చర్చలను జట్టుగా మేము అసలు పట్టించుకోలేదు. ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు మనం వెళ్తున్నాం అనే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం. వారికంటే మెరుగ్గా ఆడి విజయం సాధించాం. ఇక, ఫైనల్లోనూ సొంత ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నామనే ఒత్తిడి, భయానికి లోను కాకుండా మా శక్తి వంచన లేకుండా కృషి చేసి ఆసాధ్యాన్ని సుసాధ్యం చేశాం.
- శ్రీచరణి
కడప డైనమైట్ నల్లపురెడ్డి శ్రీచరణి మహిళల వన్డే ప్రపంచకప్‌లో తన సత్తా ఏంటో నిరూపించింది. జట్టు కష్ట సమయాల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన చేతికి బంతి ఇచ్చిన ప్రతిసారి ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రశంసలు అందుకొంది. ఇరవై ఏళ్ల వయస్సులోనే ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా అందులో అద్భుత ప్రదర్శన కనబర్చిన తెలుగమ్మాయి శ్రీచరణిపై ప్రత్యేక కథనం.
ఈ వార్తలు కూడా చదవండి...
కృత్రిమ మేధస్సుతో అడవి ఏనుగుల సమస్య పరిష్కారం: పవన్ కల్యాణ్
మంచి వెనకే చెడు.. అంతా డైవర్ట్ కోసమేనా?.. వర్మ అనుమానాలు
Read Latest AP News And Telugu News