Share News

Archery World Championship: క్వార్టర్స్‌లో జ్యోతికి నిరాశ

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:16 AM

ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో తెలుగు ఆర్చర్‌ జ్యోతి సురేఖకు నిరాశ ఎదురైంది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం క్వార్టర్స్‌లో భారత్‌కే చెందిన పర్ణీత్‌ కౌర్‌ 149-147తో...

Archery World Championship: క్వార్టర్స్‌లో జ్యోతికి నిరాశ

గ్వాంగ్జు (కొరియా): ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో తెలుగు ఆర్చర్‌ జ్యోతి సురేఖకు నిరాశ ఎదురైంది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం క్వార్టర్స్‌లో భారత్‌కే చెందిన పర్ణీత్‌ కౌర్‌ 149-147తో సురేఖను ఓడించింది. కాగా, సెమీ్‌సలో 142-143తో సోఫియా పైజ్‌ (ఎల్‌ సాల్వడార్‌) చేతిలో పరాజయం పాలైన పర్ణీత్‌ కౌర్‌.. కాంస్యం పోరులోనూ విఫలమైంది. కౌర్‌ 144-145తో అలెగ్జాండ్రా ఉస్కియానో (కొలంబియా) చేతిలో ఓటమి పాలైంది. మహిళల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌లో వెటరన్‌ దీపిక కుమారి, గథా కడాకే, అంకిత భక్త్‌లతో కూడిన భారత జట్టు సెమీ్‌సలో 2-6తో జపాన్‌ చేతిలో ఓడింది. కాంస్యం కోసం కొరియాతో తలపడనుంది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 05:16 AM