Michael Jordan: జోర్డాన్ బ్రయాంట్ కార్డుకు వేలంలో రూ 113 కోట్లు
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:00 AM
అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజాలు మైకేల్ జోర్డాన్, కోబ్ బ్రయాంట్ మరోసారి చరిత్ర సృష్టించారు. ఈసారి బాస్కెట్‌బాల్ కోర్టులో కాదు.. బయట. ఈ ఇద్దరూ సంతకాలు చేసిన బాస్కెట్‌బాల్ కార్డుకు వేలంలో...
న్యూయార్క్: అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజాలు మైకేల్ జోర్డాన్, కోబ్ బ్రయాంట్ మరోసారి చరిత్ర సృష్టించారు. ఈసారి బాస్కెట్‌బాల్ కోర్టులో కాదు.. బయట. ఈ ఇద్దరూ సంతకాలు చేసిన బాస్కెట్‌బాల్ కార్డుకు వేలంలో ఏకంగా రూ. 113 కోట్ల ధర పలకడం విశేషం. 2007- 08లో జోర్డాన్, బ్రయాంట్ ధరించిన జెర్సీలు, వాళ్ల సంతకాలతో కూడిన లోగోను ముద్రించిన ఆ కార్డును ఈనెల 23న వేలం వేశారు. క్రీడా చరిత్రలో వేలంలో ఓ కార్డుకు ఇంత ధర పలకం ఇదే తొలిసారి. ఈ క్రమంలో 2022లో బేస్‌బాల్ దిగ్గజం మికీ మాంటెల్ సంతకంతో కూడిన కార్డుకు పలికిన రూ. 110 కోట్ల ధర రికార్డును జోర్డాన్, బ్రయాంట్ కార్డు అధిగమించారు. కాగా బ్రయాంట్ 2020లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి