J&K cricketer road accident: షాకింగ్ యాక్సిడెంట్.. కశ్మీర్ క్రికెటర్ ఎలా చనిపోయాడో చూడండి..
ABN , Publish Date - Aug 25 , 2025 | 08:12 PM
జమ్ము, కశ్మీర్‌కు చెందిన ఓ యువ క్రికెటర్ అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కశ్మీర్‌కు చెందిన ప్రతిభావంతుడైన ఫరీద్ హుస్సేన్ ఈ నెల 20వ తేదీన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది.
జమ్ము, కశ్మీర్‌కు చెందిన ఓ యువ క్రికెటర్ అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కశ్మీర్‌కు చెందిన ప్రతిభావంతుడైన ఫరీద్ హుస్సేన్ ఈ నెల 20వ తేదీన రోడ్డు ప్రమాదానికి (road accident) గురై మరణించాడు. ఆ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసిన వారందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Jammu and Kashmir cricketer).
జమ్మ, కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు చెందిన వర్ధమాన క్రికెటర్ ఫరీద్ హుస్సేన్ (Fareed Hussain) స్కూటర్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన కారు పక్కగా హుస్సేన్ తన స్కూటర్‌పై వెళ్తున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా ఆ కారు డోర్ తెరుచుకుంది. ఆ కారు డోర్‌ను ఢీకొట్టిన ఫరీద్ పక్కన పడిపోయాడు. అతడి తలకు బలమైన గాయమైంది. వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స తీసుకుంటూ శనివారం ఫరీద్ మరణించాడు.
ఫరీద్ హుస్సేన్ జమ్ము, కశ్మీర్‌లో మంచి పేరు సంపాదించుకున్న క్రికెటర్. ఆ రాష్ట్రంలోని అనేక టోర్నమెంట్లలో పాల్గొని సత్తా చాటాడు. కెరీర్ ప్రారంభ దశలోనే అతడు ఇలా అకాల మరణం పాలవ్వడం స్థానికులను కలిచివేస్తోంది. కాగా, ఆ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫుటేజ్ చూసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం తీసిందని చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్.. రింకూ సింగ్ సంచలన కామెంట్స్..
యూఎస్ ఓపెన్‌లో హైడ్రామా.. రాకెట్‌ను విరగ్గొట్టిన డానియెల్ మెద్వదేవ్.. వీడియో వైరల్..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..