Share News

Asia Cup 2025: మిడిలార్డర్‌లో జితేష్‌కు చాన్స్‌

ABN , Publish Date - Sep 26 , 2025 | 04:02 AM

ఆసియా కప్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఇప్పటికే ఖరారు చేసుకొన్న భారత్‌.. సూపర్‌-4లో శుక్రవారం శ్రీలంకతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో తలపడబోతోంది. భారత్‌కు ఈ మ్యాచ్‌ నామమాత్రమేగనుక కొన్ని ప్రయోగాలు చేసే...

Asia Cup 2025: మిడిలార్డర్‌లో జితేష్‌కు చాన్స్‌

లంకతో సూపర్‌-4 పోరు నేడుఫ రాత్రి 8 గం. నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

దుబాయ్‌: ఆసియా కప్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఇప్పటికే ఖరారు చేసుకొన్న భారత్‌.. సూపర్‌-4లో శుక్రవారం శ్రీలంకతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో తలపడబోతోంది. భారత్‌కు ఈ మ్యాచ్‌ నామమాత్రమేగనుక కొన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. వికెట్‌ కీపర్‌/బ్యాటర్‌ సంజూ శాంసన్‌ మిడిలార్డర్‌లో ఇమడలేక పోతుండడంతో.. ఆ స్థానంలో జితేష్‌ శర్మకు చాన్స్‌ దక్కొచ్చు. ఫినిషర్‌గానూ అతడిని పరీక్షించడానికి ఇదే చివరి చాన్స్‌ కూడా. కాగా, టీమిండియాను ఎక్కువ ఆందోళనకు గురిచేస్తున్న సమస్య ఫీల్డింగ్‌. టోర్నీలో మొత్తం 10 క్యాచ్‌లు చేజార్చగా.. ఒక్క బంగ్లాతో మ్యాచ్‌లోనే ఐదు క్యాచ్‌లు వదిలేశారు. ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ ఇటీవలే ప్రత్యేకంగా సాధన చేయించిన తర్వాత కూడా భారత ఫీల్డర్లలో మార్పు రాలేదు. కనీసం ఫైనల్‌నాటికైనా టీమిండియా ఫీల్డింగ్‌ మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ వైఫల్యం జట్టును మరింత ఒత్తిడికి గురిచేస్తోంది. అభిషేక్‌ శర్మ అదరగొడుతున్నా.. గిల్‌ టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేయలేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇక స్టార్‌ పేసర్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. మరోవైపు రెండు వరుస ఓటములతో టోర్నీ నుంచి అవుటైన లంక.. ఈ మ్యాచ్‌లోనైగా గెలిచి పరువు దక్కించుకోవాలనుకొంటోంది.

జట్లు (అంచనా): అభిషేక్‌, గిల్‌, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, శాంసన్‌/జితే్‌ష (వికెట్‌ కీపర్‌), శివం దూబే, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా/అర్ష్‌దీప్‌ సింగ్‌.

శ్రీలంక: పథుం నిస్సంక, కుశాల్‌ మెండిస్‌ (వికెట్‌ కీపర్‌), కుశాల్‌ పెరీరా, అసలంక (కెప్టెన్‌), కమిందు మెండిస్‌, షనక, హసరంగ, కరుణ్‌రత్నే, చమీర, తీక్షణ.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్

విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2025 | 04:02 AM