Share News

Gilchrist: బుమ్రాపై గిల్లీ ప్రశంస

ABN , Publish Date - May 03 , 2025 | 04:16 AM

భారత పేసర్‌ బుమ్రాను బౌలింగ్‌లో బ్రాడ్‌మన్‌గా గిల్‌క్రిస్ట్‌ ప్రశంసించాడు. ఐపీఎల్‌లో అతడి అద్భుత బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్‌ విజయపథంలో ఉంది.

Gilchrist: బుమ్రాపై గిల్లీ ప్రశంస

  • బౌలింగ్‌లో బ్రాడ్‌మన్‌

న్యూఢిల్లీ: భారత స్టార్‌ పేసర్‌ బుమ్రాను బౌలింగ్‌లో బ్రాడ్‌మన్‌గా అభివర్ణించవచ్చని ఆస్ర్టేలియా మాజీ ఓపెనర్‌ గిల్‌క్రిస్ట్‌ కొనియాడాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ను క్రీడాపండితులు పేర్కొంటారు. గాయం నుంచి కోలుకున్న బుమ్రా రాకతో ముంబై ఇండియన్స్‌ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రాజస్థాన్‌పై తన చివరి మూడు ఓవర్లలో తను కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. ‘బుమ్రాను ఏ ఫార్మాట్‌లోనైనా ఉత్తమ బౌలర్‌గా చెప్పవచ్చు. పిచ్‌ ఎలాంటిదైనా మైదానంలో అతడి ప్రదర్శన చూస్తే బ్రాడ్‌మన్‌ గుర్తుకురాక మానడు. అందుకే అతడిని బౌలింగ్‌లో బ్రాడ్‌మన్‌గా చెప్పవచ్చు’ అని గిల్లీ అన్నాడు.

Updated Date - May 03 , 2025 | 04:17 AM