Jamie Overton: టెస్టులకు ఓవర్టన్ విరామం
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:33 AM
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ముందు ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి నిరవధిక విరా మం తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇకపై పరిమిత ఓవర్ల ఆటపైనే దృష్టి సారిస్తానని...
లండన్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ముందు ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి నిరవధిక విరా మం తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇకపై పరిమిత ఓవర్ల ఆటపైనే దృష్టి సారిస్తానని స్పష్టం చేశాడు. మూడేళ్ల బ్రేక్ తర్వాత అతను ఇటీవలి అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో చోటు దక్కించుకుని ఆఖరి టెస్టు ఆడాడు. ‘ఇకపై మూడు ఫార్మాట్లలో కొనసాగలేను. శారీరకంగా, మానసికంగా అసాధ్యంగా అనిపిస్తోంది. అందుకే టెస్టుల నుంచి విరామం తీసుకుంటున్నా. ఇక నుంచి నా దృష్టంతా వైట్ బాల్ క్రికెట్‌పైనే’ అని ఓవర్టన్ పేర్కొన్నాడు. 2022లో టెస్టు అరంగేట్రం చేసిన ఓవర్టన్ రెండు టెస్టుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
హరీష్ రావును టార్గెట్ చేసింది అందుకేనా..?
For More AP News And Telugu News