ISSF World Shooting Championship: ఇషా జోడీకి రజతం
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:26 AM
ఐఎస్‌స్ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షి్‌పలో ఇషా సింగ్ జంట, ఒలింపియన్ ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ రజతాలు దక్కించుకొన్నారు. మంగళవారం జరిగిన 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్...
వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షి్‌ప
కైరో: ఐఎస్‌స్ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షి్‌పలో ఇషా సింగ్ జంట, ఒలింపియన్ ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ రజతాలు దక్కించుకొన్నారు. మంగళవారం జరిగిన 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ స్వర్ణ పోరులో ఇషా-సమ్రాట్ రాణా జంట 10-16తో చైనాకు చెందిన కియాంగ్జిన్ యో-కై హు చేతిలో పరాజయం పాలయ్యారు. కొరియా ద్వయం ఇజిన్ హో-సుహియాన్ హోంగ్ కాంస్యం దక్కించుకొంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఇషా-సమ్రాట్ జోడీ 586 పాయింట్లతో టాప్ లేపింది. అయితే, సురుచి-శ్రవణ్ కుమార్ జంట 579 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేక పోయింది. కాగా, పురుషుల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్లో ఐశ్వరి ప్రతాప్ 466.9 పాయింట్లతో రెండో స్థానంలో, నీరజ్ కుమార్ 432.6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. చైనా షూటర్ యుకిన్ లియు స్వర్ణం, ఫ్రాన్స్ ప్లేయర్ రొమెయిన్ కాంస్యం సాధించారు. అయితే, క్వాలిఫయింగ్ రౌండ్‌లో 597 పాయింట్లు సాధించిన ఐశ్వరి ప్రపంచ రికార్డును సమం చేశాడు.
ఇవి కూడా చదవండి
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి