ఐర్లాండ్ 270 పరుగులు 8 వికెట్లలు
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:43 AM
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఐర్లాండ్ బ్యాటర్లు తడబడ్డారు. మంగళవారం మొదలైన ఈ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి...
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు
సిల్హెట్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఐర్లాండ్ బ్యాటర్లు తడబడ్డారు. మంగళవారం మొదలైన ఈ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 8 వికెట్లకు 270 పరుగులు సాధించింది. పాల్ స్టిర్లింగ్ (60), కార్మికేల్ (59) అర్ధసెంచరీలతో రాణించారు. కాంఫెర్ (44), టక్కర్ (41), జోర్డాన్ నీల్ (30) ఫర్వాలేదనిపించారు. క్రీజులో మెక్‌కార్తి (21) ఉన్నాడు. స్పిన్నర్లు మెహిదీ హసన్‌కు మూడు, హసన్ మురాద్‌కు రెండు వికెట్లు దక్కాయి. అయితే ఫీల్డింగ్‌లో విఫలమైన బంగ్లా క్రికెటర్లు ఐదు క్యాచ్‌లను వదిలేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి