IPL 2025 auction: IPL 2026పై క్రేజీ అప్‌డేట్.. ఆక్షన్ డేట్ ఇదే!
ABN , Publish Date - Oct 10 , 2025 | 02:07 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఐపీఎల్ మ్యాచుల ప్రారంభం కంటే ముందు జరిగే ఆటగాళ్ల వేలం పై అందరిలో ఆసక్తి ఉంటుంది. ఏటా ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఏ ప్లేయర్ ఏ జట్టులోకి వెళ్తాడు అనే ఇంట్రెస్ట్ క్రికెట్ అభిమానుల్లో ఉంటుంది. అందుకే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఐపీఎల్ మ్యాచుల ప్రారంభం కంటే ముందు జరిగే ఆటగాళ్ల వేలం పై అందరిలో ఆసక్తి ఉంటుంది. ఏటా ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఏ ప్లేయర్ ఏ జట్టులోకి వెళ్తాడు అనే ఇంట్రెస్ట్ క్రికెట్ అభిమానుల్లో ఉంటుంది. అందుకే ఐపీఎల్ కి సంబంధించిన సమచారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ఐపీఎల్ అభిమానుల కోసం ప్లేయర్ ఆక్షన్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
ఐపీఎల్ 2026 వేలం(IPL 2026 Auction) తేదీ దాదాపుగా ఖరారైందని సమాచారం. డిసెంబర్ 13 మరియు 15 మధ్య వేలం జరిగే అవకాశం ఉందని పలు క్రీడా నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఐపీఎల్ నిర్వాహకులు మాత్రం దీనిపై ఇంకా అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించలేదు. వేలం ఎక్కడ జరుగుతుందో, లేదా అది మళ్ళీ విదేశాలలో జరుగుతుందో లేదో ఇంకా సమాచారం లేదు. గత రెండు వేలం విదేశాలలో జరిగిన సంగతి తెలిసిందే. 2023 వేలం దుబాయ్‌లో, 2024 వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగాయి.
ఈ సారి మిని వేలం ముంబై(Mumbai)లో జరుగుతుందని సమాచారం. అయితే, ఈ నిర్ణయం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అన్ని ఫ్రాంచైజీలు నవంబర్ 15లోగా తమ రిటెన్షన్ జాబితాను BCCIకి సమర్పించాల్సి ఉంటుంది. విడుదల చేయబోయే ఆటగాళ్ల పేర్లను కూడా అంతకుముందే ఖరారు చేయాలి. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు రాజస్థాన్ రాయల్స్ (RR) మినహా, ఇతర జట్లలో పెద్ద మార్పులు జరిగే అవకాశం ప్రస్తుతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
IPL 2026 వేలంలో ఆసీస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్‌కు(Cameron Green) భారీ ధర దక్కే అవకాశం ఉంది. గత సీజన్‌లో గాయంతో మిస్ అయిన గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత ప్రాంఛైజీలు కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. గత ఐపీఎల్(IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అంతేకాక ఆ జట్టుకు ఇదే తొలి కప్ కావడం విశేషం.