Share News

IPL 2026: వచ్చే నెలలో వేలం!

ABN , Publish Date - Nov 09 , 2025 | 04:43 PM

ఐపీఎల్ 2026 వేలం ప్రక్రియ డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15న వేలం నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నవంబర్ 15లోపు అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుందని సమాచారం.

IPL 2026: వచ్చే నెలలో వేలం!
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026(IPL 2026) సందడి మొదలు కాబోతుంది. ఈ సీజన్ వేలం ప్రక్రియ డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15న వేలం నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నవంబర్ 15లోపు అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుందని సమాచారం.


భారత్‌లోనే ఆక్షన్..

గతంలో రెండు సీజన్ల మాదిరిగానే ఈ సారి కూడా గల్ఫ్ దేశాల్లోనే ఐపీఎల్ వేలం నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఫ్రాంచైజీలకు కూడా తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సారి ఐపీఎల్ ఆక్షన్ భారత్‌లోనే ఉంటుందని తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. మరి ఏ నగరంలో వేలం నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. గత రెండు ఆక్షన్‌లను వేరే దేశంలో నిర్వహించారు. 2023లో దుబాయ్, 2024లో సౌదీ అరేబియాలో వేలం ప్రక్రియ జరిపారు. ఐపీఎల్ 2026 వేలం ప్రక్రియ గురించి బీసీసీఐ(BCCI) నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


డబ్ల్యూపీఎల్ వేలం అప్పుడే!

మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2026) సీజన్ కోసం నవంబర్ 27న ఢిల్లీలో మెగా వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే టోర్నీలోని ఐదు జట్లు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 13, గుజరాత్ జెయింట్స్‌లో 16, ముంబై ఇండియన్స్‌లో 13, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 14, యూపీ వారియర్స్‌లో 17 ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా యూపీ ఫ్రాంచైజీ పర్స్‌లో రూ.14.5కోట్లు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

అన్నీసార్లు దూకుడు పనికిరాదు: ఇర్ఫాన్ పఠాన్

గంగూలీ ఐసీసీ ఛైర్మన్ అవుతాడు: మమతా బెనర్జీ

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 09 , 2025 | 04:43 PM