IPL 2025 MI vs DC: వర్షం కరుణిస్తుందా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
ABN , Publish Date - May 21 , 2025 | 05:46 PM
ఐపీఎల్‌లో అత్యంత ఆసక్తిర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక బెర్త్‌ను డిసైడ్ చేసే కీలక మ్యాచ్‌కు మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఆ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.
ఐపీఎల్‌లో (IPL 2025) అత్యంత ఆసక్తిర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక బెర్త్‌ను డిసైడ్ చేసే కీలక మ్యాచ్‌కు మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఆ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), ముంబై ఇండియన్స్ (MI) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి (MI vs DC).

టోర్నీ ఆరంభంలో తడబడిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుస విజయాలు అందుకుంటూ ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రోహిత్ శర్మ, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యాతో కూడిన బ్యాటింగ్ విభాగం అత్యంత బలంగా కనబడుతోంది. ఇక, బుమ్రా, బౌల్ట్‌తో కూడిన అరవీర భయంకర బౌలింగ్ విభాగం ముంబై సొంతం. దీపక్ ఛాహర్, కర్ణ్ శర్మ కూడా చక్కగా రాణిస్తున్నారు. స్వంత స్టేడియంలో ఆడనుండడం ముంబైకి మరింతగా కలిసొచ్చే అంశంగా కనబడుతోంది.
మరోవైపు ముంబైకు పూర్తి విరుద్ధంగా తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్థానం సాగింది. ఆరంభంలో వరుస విజయాలు సాధించి తర్వాత లయ తప్పింది. వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ కోసం పోరాటం సాగిస్తోంది. కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ మాత్రమే స్థిరంగా రాణిస్తున్నారు. డుప్లెసిస్ వరుసగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా వేగంగా పరుగులు చేయడంలో లోయర్ ఆర్డర్ తడబడుతోంది. కీలక బౌలర్ మిచెల్ స్టార్క్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద లోటుగా కనబడుతోంది.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్ (అంచనా): రోహిత్ శర్మ, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నమన్ ధీర్, దీపక్ ఛాహర్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, కర్ణ్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ (అంచనా): కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, డుప్లెసిస్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, నటరాజన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఇవీ చదవండి:
బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!
డోపింగ్‌లో పట్టుబడ్డ శివ్‌పాల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి