Share News

Gautam Gambhir: దేశవాళీలు ఆడడం ఉత్తమం

ABN , Publish Date - Oct 15 , 2025 | 03:07 AM

భారత జట్టు రెండో టెస్టులో గెలిచినప్పటికీ అరుణ్‌ జైట్లీ స్టేడియం పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘స్పిన్నర్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అందరూ చెబుతుంటారు. కానీ టీమ్‌లో ఇద్దరు అద్భుత పేసర్లు...

Gautam Gambhir: దేశవాళీలు ఆడడం ఉత్తమం

పిచ్‌పై భారత్‌ అసంతృప్తి

భారత జట్టు రెండో టెస్టులో గెలిచినప్పటికీ అరుణ్‌ జైట్లీ స్టేడియం పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘స్పిన్నర్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అందరూ చెబుతుంటారు. కానీ టీమ్‌లో ఇద్దరు అద్భుత పేసర్లు ఉన్నప్పుడు వారికి కూడా పిచ్‌పై సమాన అవకాశం లభించాలి కదా’ అని కోచ్‌ గంభీర్‌ అన్నాడు.

రాణాపై ట్రోలింగ్‌ సిగ్గుచేటు

న్యూఢిల్లీ: రంజీలు ఆడాలని టెస్ట్‌ స్పెషలి్‌స్టలకు హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ సలహా ఇచ్చాడు. సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ నేపథ్యంలో బెంగళూరులోని సీవోఈలో స్కిల్‌ ట్రైనింగ్‌కు వెళ్లేకంటే.. ఆయా రాష్ట్రాల తరఫున రంజీలు ఆడితే మంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. వచ్చే నెల 9న బ్రిస్బేన్‌లో భారత్‌ చివరి టీ20 ఆడనుండగా.. 14న కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ను షెడ్యూల్‌ చేశారు. ఇంత తక్కువ సమయంలో ఒక ఫార్మాట్‌ నుంచి మరో ఫార్మాట్‌కు మారడం కొంత కష్టమైన విషయమేనని టెస్ట్‌ మ్యాచ్‌ ముగిసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో గౌతీ అన్నాడు. ఇక, యంగ్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌పై గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు 2027 వరల్డ్‌ కప్‌ ఆడతారా? అని ఎదురైన ప్రశ్నకు ఇప్పుడే ఏమీ చెప్పలేమని గౌతీ సమాధానమిచ్చాడు. పేసర్‌ హర్షిత్‌ రాణా ఎంపికను ప్రశ్నించిన మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్‌కి కౌంటర్‌ ఇచ్చాడు. ‘యూ ట్యూబ్‌ చానెల్‌ నడుపుతున్న ఓ వ్యక్తి 23 ఏళ్ల కుర్రాడిని టార్గెట్‌ చేయడం సిగ్గుచేటు. నన్ను టార్గెట్‌ చేయండి ఎదుర్కొంటా. తన ప్రతిభతోనే జట్టులో స్థానం సంపాదించిన రాణాను గేలి చేయడం అన్యాయమ’ని గౌతీ అన్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 03:07 AM